మహాభారతం అనేది ఎన్నో సార్లు తెరమీదకు వచ్చిన ఇతిహాసం. కానీ ‘Kurukshetra – Part 1’ లో నెట్‌ఫ్లిక్స్ చూపించిన కోణం కొత్తది. ఇది కేవలం దేవతల యుద్ధం కాదు, మనసుల మధ్య ధర్మం, అహంకారం, బాధ్యతల మధ్య జరిగే పోరాటం.
మొదటి భాగంలో తొమ్మిది ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ ఒక యోధుడి దృష్టిలో కథను చూపిస్తుంది — భీష్ముడి నిబద్ధత, అర్జునుడి సందేహం, కర్ణుడి గర్వం, ద్రౌపదీ ఆవేదన… యుద్ధం భూమిపై నడుస్తున్నా, యుద్ధం అసలు మనసుల్లోనే ఉందని చూపిస్తుంది.
దర్శకుడు ఉజ్జాన్ గంగూలీ యానిమేషన్ ద్వారా ఆ గంభీరతను తెరపైకి తెచ్చాడు. కానీ కొన్ని సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి.అక్కడక్కడా స్లో నేరేషన్ ఉన్నావిమర్శించదగ్గ స్థాయిలో అయితే లేదు.
బలాలు
- గుల్జార్ వాయిస్ ఓవర్ ఒక ఆధ్యాత్మిక టోన్ ను ఇస్తుంది.
- సంగీతం, సౌండ్ ఎఫెక్ట్స్ యుద్ధభూమి వాతావరణాన్ని అద్భుతంగా ప్రతిబింబించేలా చేశాయి.
- కొన్ని ఎపిసోడ్లలో పాత్రల ఆలోచనలు చాలా సహజంగా రాసారు.
బలహీనతలు
- యానిమేషన్ అక్కడక్కడా చీప్ గా కనపడింది.
- కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగుతుంది, దాంతో ఆసక్తి కొంచెం తగ్గుతుంది.
ఫైనల్ గా ..
‘Kurukshetra – Part 1’ మనకి మహాభారతం కొత్త కోణంలో చూపిస్తుంది. కొన్ని లోపాలు ఉన్నా మనకి గొప్ప అనుభూతి ఇవ్వడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి.
OTT PLATFORM : NETFLIX

