16 నుండి 18 ఏళ్ల మధ్య వయసు గల యువతీ యువకుల పరస్పర అంగీకార సంబంధాలను నేరంగా పరిగణించకూడదు
POCSO చట్టం (Protection of Children from Sexual Offences Act) క్రింద యువత 18 ఏళ్ల కనీస వయసు పరిమితిని 16 ఏళ్లకు తగ్గించాలని,16 నుండి 18 ఏళ్ల మధ్య వయసు గల యువతీ యువకుల పరస్పర అంగీకార సంబంధాలను నేరంగా పరిగణించకూడదు అని సుప్రీం కోర్టులో సంచలన పిటిషన్ దాఖలు అయ్యింది.భారత సుప్రీంకోర్టు నవంబర్ 12న న్యాయవాది మహువా మొయిత్రా మరియు ఇతరులు దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణ ప్రారంభించనుంది.
రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కు (Right to Privacy)ను ఉల్లంఘిస్తోందని వాదించారు. ఆమె అభిప్రాయంలో, టీనేజ్ వయసులో ఉన్న యువత మానసికంగా, భావోద్వేగపరంగా అభివృద్ధి చెందినవారు, కాబట్టి వారి పరస్పర అంగీకార సంబంధాలను నేరంగా చూడడం అన్యాయమని పేర్కొన్నారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. 18 ఏళ్ల వయసు పరిమితి పిల్లలను లైంగిక దుర్వినియోగం నుండి కాపాడేందుకు కీలకం అని, భారతదేశం వంటి సాంప్రదాయపరమైన సమాజంలో ఈ రక్షణ అవసరమని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.
న్యూరో సైన్స్ నిపుణులు చెబుతున్నదేమిటంటే — టీనేజ్ వయసులో సొంత నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం ఉండదు కాబట్టి ,ఆ వయసులో తీసుకున్న భావోద్వేగ నిర్ణయాలు భవిష్యత్తులో ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. చాలామంది విద్య, ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థలపై దీని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివేదికల ప్రకారం, 2019 నుండి పాక్సో కేసులు 180% పెరిగాయి, ఇది చట్టం అమలులో ఉన్న ఆవశ్యకతను చూపిస్తుంది.
ఫైనల్ గా సుప్రీం కోర్టు ఈ కేసుపై తీర్పు ఎలా ఉన్నా దేశంలో యువతీ యువకుల రిలేషన్స్ విషయంలో ప్రముఖమైన మలుపుగా నిలవొచ్చు.!

