గతంలో ఏపీ ఎన్నికల ఫలితాలను చాలా దగ్గరగా అంచనా వేసి ‘KK సర్వే’ సంస్థ మంచి పేరు తెచ్చుకుంది. 2019, 2024 ఎన్నికలలో వారి అంచనాలు నిజం కావడంతో, ఆ సంస్థపై రాజకీయ వర్గాల్లో మరియు ప్రజల్లో నమ్మకం పెరిగింది.
అయితే, ఈ నమ్మకాన్నంతా తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఒక్క దెబ్బతో పాడుచేసింది. ఈ ఉపఎన్నికలో BRS అభ్యర్థి మగంటి సునీత గెలుస్తారని KK సర్వే ఎగ్జిట్ పోల్ ఇచ్చింది. BRS శ్రేణులు కూడా ఈ సర్వే చూసి గెలుపుపై ధీమాగా ఉన్నారు.
కానీ, శుక్రవారం వచ్చిన ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, BRS అభ్యర్థి సునీతపై సుమారు 24,700 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో KK సర్వే అంచనా బొక్కబోర్లా పడినట్లయింది.
ఈ పరిణామం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో ‘ఆరా మస్తాన్’ సర్వే కూడా 2019లో వైసీపీ గెలుపును కరెక్ట్‌గా చెప్పి, 2024 నాటికి అదే పార్టీతో అంతర్గత ఒప్పందాలు చేసుకుని తప్పుడు నివేదికలు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు KK సర్వే కూడా అదే దారిలో నడుస్తోందా అనే సందేహాలు మొదలయ్యాయి.
ఇలాంటి తప్పుడు సర్వేల వల్ల బెట్టింగ్ రాయుళ్లు కూడా కోట్లలో నష్టపోతున్నారని సమాచారం. కేవలం రాజకీయ పార్టీల మెప్పు పొందడం కోసం, ఈ సర్వే సంస్థలు తమ విలువైన విశ్వసనీయతను తాకట్టు పెడుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల నాడిని పట్టాల్సిన సర్వేలు, పార్టీ నేతల చేతులు పట్టుకునే స్థాయికి దిగజారడం ఆందోళన కలిగించే విషయం.


శ్రీవారి దర్శనంపై యాంకర్ శివజ్యోతికి జీవితకాల నిషేధం? టీటీడీ సంచలన నిర్ణయం!
on November 27, 20250