రాజమౌళి సినిమా అనౌన్స్ మెంట్ వస్తే ఆ కిక్కే వేరు. కానీ ‘వారణాసి’ టైటిల్ విషయంలో జక్కన్న టీమ్ చిన్నపాటి గ్యాంబ్లింగ్ చేసినట్లు కనిపిస్తోంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, ‘వారణాసి’ అనే టైటిల్ ని గతంలోనే మరో నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేయించుకుంది. ఆది సాయికుమార్ తో గతంలో ‘రఫ్’ సినిమా తీసిన డైరెక్టర్ సి.హెచ్. సుబ్బారెడ్డి ఈ టైటిల్ ని తన సినిమా కోసం రిజిస్టర్ చేయించుకున్నారట. కాశీ నేపథ్యంలోనే ఆ కథ కూడా సాగుతుందట.
అయితే, టైటిల్ వేరే వారి దగ్గర ఉందని తెలిసినా, రాజమౌళి టీమ్ తెలివిగా టైటిల్ కార్డులో “SS Rajamouli’s Varanasi” (ఎస్ఎస్ రాజమౌళి వారణాసి) అని ప్రకటించింది. ఇది ఇండస్ట్రీలో పాత టెక్నిక్. గతంలో ‘కలేజా’ టైటిల్ విషయంలో వివాదం వస్తే ‘మహేష్ కలేజా’ అని, ‘కత్తి’ విషయంలో ‘కళ్యాణ్ రామ్ కత్తి’ అని మార్చిన సంగతి తెలిసిందే. “అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు,” టైటిల్ వేరే వాళ్ళదైతే, ముందు చిన్న తోక తగిలించి వాడేసుకోవడం ఇక్కడ కామన్.
కానీ, అవతలి వారు చిన్న నిర్మాతలు అయినా, లీగల్ గా వారిదే పైచేయి. కేవలం పేరు ముందు డైరెక్టర్ పేరు చేర్చినంత మాత్రాన కాపీరైట్ సమస్యలు పోవు. ఇప్పుడు ఆ చిన్న నిర్మాతలు రాజీకి వస్తారా? లేక భారీ మొత్తం డిమాండ్ చేస్తారా? అనేది చూడాలి. రాజమౌళి లాంటి బ్రాండ్ వాడుకున్నారు కాబట్టి, తెరవెనుక ‘సెటిల్మెంట్’ జరిగే అవకాశాలే ఎక్కువ. టైటిల్ మార్చే ప్రసక్తే లేదు కాబట్టి, “డబ్బుతో కొట్టేస్తే పోలా” అనే సామెత ఇక్కడ నిజం కావొచ్చు!

