యాంకర్ సుమ కనకాల కొడుకుగా టాలీవుడ్లో అడుగుపెట్టిన యంగ్ హీరో రోషన్ కనకాల.. ఇప్పుడు తన రెండో సినిమా మోగ్లీ 2025 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే, మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ ‘వనవాసం’ లిరికల్ వీడియోను విడుదల చేశారు.
పాట పేరు వినగానే ఇది ఏదో మెలోడీ ట్రాక్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. ఇది మామూలు పాటే కాదు, “ది లౌడెస్ట్ వార్ క్రై ఆఫ్ ది మోడ్రన్ రామాయణ” అని మేకర్స్ ప్రకటించారు. అంటే, ఇది అచ్చంగా ఒక యుద్ధ శంఖారావం. ఈ పాట వింటుంటేనే మనసులో తెలియని ఉత్తేజం, ఉద్వేగం కలుగుతాయి.
ఈ పాటకి మ్యూజిక్ అందించడమే కాకుండా, సింగర్‌గా కూడా తన పవర్ చూపించాడు కాల భైరవ. RRR లోని ‘కొమరం భీముడో’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కాల భైరవ, ఈ ‘వనవాసం’ ట్రాక్‌కు కూడా అంతే ఎనర్జీని ఇచ్చాడు. సోనీ కొమండూరితో కలిసి భైరవ అందించిన వోకల్స్ పాటను మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. పాటలో వచ్చే పవర్ఫుల్ పెర్కషన్స్, డ్రైవింగ్ రిథమ్.. అడవిలోని ఉగ్రరూపాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాయి.
ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి అందించిన లిరిక్స్ కథలోని భావోద్వేగాలను పట్టిచూపాయి. ‘వనవాసం’ అనే టైటిల్‌కు తగ్గట్టే.. ఈ సినిమా కథాంశం ఒక మోడ్రన్ రామాయణాన్ని పోలి ఉంటుందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. సీత కోసం రాముడు అడవిలో చేసిన పోరాటం లాగే, ఈ సినిమాలో హీరో రోషన్ తన ప్రేమను కాపాడుకోవడానికి చేసే యుద్ధమే ఈ సినిమా మూల కథ.
కలర్ ఫోటో వంటి నేషనల్ అవార్డ్ గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్.. ఈసారి ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామాను ఎంచుకోవడంలోనే ఆయన ధైర్యం కనిపిస్తోంది. రోషన్ పోషిస్తున్న కిట్టు అనే అనాగరికమైన యువకుడి పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ముఖ్యంగా, విలన్ పాత్రలో కనిపించే బండి సరోజ్ కుమార్ నుంచి తన మూగ-చెవిటి ప్రియురాలిని కాపాడుకోవడానికి హీరో అడవిలో చేసే పోరాటం ఉత్కంఠ భరితంగా ఉంటుందట.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోకు నాచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ ఇవ్వగా.. టీజర్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సపోర్ట్ అందించారు. ఇవన్నీ చూస్తుంటే.. తల్లి సుమ కనకాల పబ్లిసిటీ పవర్ ఎంత ఉందో.. సినీ పెద్దల ఆశీస్సులు కూడా అంతే బలంగా రోషన్‌కు ఉన్నాయని అర్థమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్ ఈ సినిమాను నిర్మించడంతో.. ప్రమోషన్స్ అన్నీ పక్కా ప్లానింగ్‌తో చేస్తున్నారు.
మొదట విడుదలైన ‘సయ్యారే’ సాంగ్ లవ్ మెలోడీగా ఉంటే, ఈ ‘వనవాసం’ ట్రాక్ మాత్రం పూర్తిగా మాస్ ఎలిమెంట్స్‌తో.. రాబోయే యాక్షన్ డ్రామాకు పర్ఫెక్ట్ హైప్ ఇచ్చింది. డిసెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మోగ్లీ 2025.. రోషన్ కనకాలను ఏ రేంజ్‌కు తీసుకెళ్తుందో చూడాలి. ఈ పాట దెబ్బకు అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగిందనడంలో సందేహం లేదు. టాలీవుడ్లో ఈ ‘వనవాసం’ ట్రెండ్ సెట్ చేస్తుందనే నమ్మకాన్ని ఈ పాట సృష్టించింది.

