టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి వార్త ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్’ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సామ్ ఏడుడుగులు వేసిందన్న వార్త, ఆ పెళ్లి ఫోటోలు బయటికి రావడం అంతా చకచకా జరిగిపోయాయి.
డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈశా యోగా సెంటర్లో అత్యంత నిరాడంబరంగా, కేవలం 30 మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ‘భూత శుద్ధి వివాహ’ పద్ధతిలో జరిగిన ఈ వేడుక ఫోటోలు సామ్ ఇన్‌స్టాలో షేర్ చేయగానే నెట్టింట వైరల్ అయ్యాయి.
అయితే, ఈ మొత్తం ఎపిసోడ్లో అందరి కళ్లు సమంత మాజీ భర్త నాగ చైతన్య పైనే ఉన్నాయి. సామ్ పెళ్లి చేసుకున్న రోజు చైతూ ఎలా స్పందిస్తాడు? సైలెంట్‌గా ఉంటాడా? లేక ఎమోషనల్ అవుతాడా? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, చైతూ మాత్రం తనదైన శైలిలో కూల్‌గా ఓ పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.
సమంత పెళ్లి ఫోటోలు ట్రెండ్ అవుతున్న సమయానికే.. చైతూ తన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘దూత’ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు.
“నిజాయితీతో, సృజనాత్మకతతో ఒక పని చేస్తే జనం దాన్ని ఎలా ఆదరిస్తారో దూత నిరూపించింది. ఈ ఎనర్జీ ఇచ్చినందుకు థ్యాంక్స్” అంటూ తన కెరీర్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు తప్ప, సామ్ పెళ్లి గురించి పరోక్షంగా కూడా ప్రస్తావించలేదు.
దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు సామ్ పెళ్లి ఫోటోల కింద “నీ ఆనందం ముఖ్యం సామ్” అని కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు చైతూ పోస్ట్ కింద “నువ్వొక డైమండ్‌ని మిస్ అయ్యావ్” అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇంకొందరేమో “చైతూ ఆల్రెడీ శోభితతో హ్యాపీగా ఉన్నాడు, డిసెంబర్ 4న వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ కూడా ఉంది.. అనవసరంగా రచ్చ చేయకండి” అంటూ చైతూకి సపోర్ట్ చేస్తున్నారు.
మొత్తానికి సామ్ తన కొత్త జీవితాన్ని రాజ్ నిడిమోరుతో సైలెంట్‌గా మొదలుపెడితే.. చైతూ మాత్రం తన పని తాను చేసుకుంటూ “నా లైఫ్ నాది” అనే క్లారిటీ ఇచ్చేశాడు. వీరిద్దరూ ఎవరి దారిన వారు హ్యాపీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం వీరి పేర్లు పక్కపక్కన ట్రెండ్ అవ్వడం కామన్ అయిపోయింది.

