కామెడీ హీరో అల్లరి నరేష్ మరోసారి సీరియస్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన తాజా చిత్రం ’12ఏ రైల్వే కాలనీ’. మంగళవారం విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్, సస్పెన్స్ మరియు సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
అల్లరి నరేష్ తన కంఫర్ట్ జోన్ వదిలి, కంటెంట్ ఉన్న సీరియస్ సినిమాలు చేస్తున్నారు. ఆయన నటిస్తున్న ’12ఏ రైల్వే కాలనీ’ సినిమాపై కొత్త ట్రైలర్‌తో అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ చిత్రం ఒక డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. ముఖ్యంగా, బ్లాక్‌బస్టర్ ‘పొలిమేర’ సిరీస్ రచయిత డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. ఆయనే షోరన్నర్‌గా కూడా వ్యవహరించడం విశేషం.
దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్, సస్పెన్స్‌ను అద్భుతంగా పెంచింది. అల్లరి నరేష్ తన కామెడీ ఇమేజ్‌కు పూర్తిగా భిన్నంగా కనిపించారు. ఈ సినిమాలో ‘పొలిమేర’ ఫేమ్ కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు సాయి కుమార్ ఒక కీలకమైన దర్యాప్తు అధికారి పాత్రలో కనిపించారు. వీరితో పాటు వైవా హర్ష, గెటప్ శ్రీను, అనీష్ కురువిల్లా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రంతో నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, ఆయనే ఎడిటింగ్ బాధ్యతలు కూడా చూసుకున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ట్రైలర్ సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంది. కుశేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ , గంభీరమైన వాతావరణాన్ని సృష్టించింది. దీనికి భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం టెన్షన్‌ను మరింత పెంచింది. ‘పొలిమేర’ వంటి హిట్ టీమ్ నుండి వస్తున్న ఈ సినిమా, నవంబర్ 21, 2025 న గ్రాండ్‌గా విడుదల కానుంది.


పవన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అగ్గి: “చిరంజీవి లేకపోతే నిన్ను ఎవ్వడు దేకడు!”
on November 30, 20250