థియేటర్లలో 100 కోట్లు.. ఓటీటీలో అదరగొడుతున్న ‘డ్యూడ్’!

‘లవ్ టుడే’ సినిమాతో సౌత్ ఇండియా అంతా సెన్సేషన్ అయిన కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘డ్యూడ్’. ఈ సినిమాలో ‘ప్రేమలు’ సినిమాతో మలయాళంలోనే కాక తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న మమిత బైజు హీరోయిన్‌గా నటించింది.

ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతాలు సృష్టించింది. ఏకంగా రూ. 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి, ప్రదీప్ రంగనాథన్‌కు బ్యాక్-టు-బ్యాక్ రెండో వంద కోట్ల సినిమాగా రికార్డు సృష్టించింది.

థియేటర్లలో దుమ్ము దులిపిన ఈ సినిమా, రీసెంట్‌గా నవంబర్ 14 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఓటీటీ ఆడియన్స్ కూడా ‘డ్యూడ్’ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

‘డ్యూడ్’ ఓటీటీ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. విడుదలైన వారం లోపే నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా తన సత్తా చాటుతోంది.

ప్రదీప్ మరియు మమిత బైజు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు, సాయి అభ్యంకర్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.

సినిమా మ్యూజిక్‌కు ఎంత క్రేజ్ వచ్చిందంటే, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సినిమా ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (OST) కావాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దీనికి స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్, త్వరలోనే OST రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కీర్తిస్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, థియేటర్, ఓటీటీ అని తేడా లేకుండా అన్నిచోట్లా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

Leave a comment