రవిబాబు డైరక్షన్ లో ‘ఏనుగు తొండం ఘటికాచలం’.. ఈటీవి విన్ లో రిలీజ్

తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచేందుకు మరో వినోదాత్మక చిత్రం సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు రవిబాబు  దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఏనుగు తొండం ఘటికాచలం’ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం నవంబర్ 13వ తేదీ నుండి ETV Win యాప్‌లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది.

వర్షిణి సౌందరరాజన్ ప్రధాన పాత్ర పోషించింది. రవిబాబు చిత్రాలంటేనే ప్రత్యేకమైన కథాంశాలు, విభిన్నమైన పాత్రలు, హాస్యం, ఉత్కంఠ కలగలిసి ఉంటాయి. ఈ సినిమా కూడా ఆయన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని అంచనా వేయవచ్చు.

ప్రస్తుతం ఓటీటీ వేదికల్లో కొత్త కంటెంట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా, ETV Win వంటి ప్లాట్‌ఫారమ్‌లు OTT ప్రేక్షకులకు  వినోదాన్ని అందించేందుకు సినీ నిర్మాణంలో భాగం అయ్యి డైరెక్ట్ గా తమ ఫ్లాట్ ఫారమ్ లోకి రిలీజ్ చేస్తున్నాయి.

 

Leave a comment