నటీనటులు: రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ , రావు రమేష్ తదితరులు.
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ఛాయాగ్రహణం: కృష్ణన్ వసంత్
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
ఎడిటర్: ఛోటా K.ప్రసాద్
నిర్మాతలు: విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని
ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రష్మిక మందన ముఖ్యపాత్రలో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ చేయడం సినీ ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారింది.ఎందుకంటే అంత పెద్ద అగ్ర కథానాయక కథలో ఏదో ఒక కొత్తదనం ఉండి ఉంటేనే ఈ సినిమాలో మెయిన్ రోల్ లో చేసి ఉంటుందని అనేది ప్రేక్షకుల నమ్మకం కాబట్టి ఇక రష్మిక కూడా కెరీర్ లోనే బెస్ట్ మూవీ చెప్పడం ద్వారా సినిమా మీద అంచనాలు పెరిగాయి.ఫైనల్ గా ఈరోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
ఇక కథ విషయానికి వస్తే..
భూమా దేవి (రష్మిక) అనే అమ్మాయి తన మాస్టర్స్ డిగ్రీ కోసం హైదరాబాద్లోని కాలేజీకి రాకతో మొదలవుతుంది.అక్కడ ఆమెకు విక్కీ (దీక్షిత్ శెట్టి) పరిచయమవుతాడు..క్రమంగా వారిద్దరి మధ్య ఒక కఠినమైన, సంక్లిష్టమైన ప్రేమకథకు దారి తీస్తుంది.తర్వాత విక్కీ తన కంట్రోల్ ఆటిట్యూడ్ అర్ధం అయ్యి బ్రేకప్ చెప్పాక విక్కీ నుంచి మరియు తన తండ్రి నుంచి ఎదురైన ముఖ్య సమస్యలను భూమా ఎలా ఎదుర్కొన్నది అనేదే కథ.!
భూమా జీవితంలోని సున్నితమైన బంధాలను ,సంబంధాలను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.అయోమయంగానే విక్కితో ప్రేమలో పడ్డ భూమా మెల్ల మెల్లగా మేల్ డామినేషన్ రిలేషన్ తెంచుకుని తన నిర్ణయాలు తనే తీసుకోవాలని, తన నిర్ణయాలు వేరే ఎవరూ తీసుకోకూడదని భావించడంతో కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. మొదట్లో బాయ్ ఫ్రెండ్ చేసేవన్నీ బాగున్నట్టు అనిపించినా, అదంతా ప్రేమేలే అని మనసుకు సర్దిచెప్పుకున్నా హీరోయిన్ కు ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. అదంతా కంట్రోలింగ్ యాటిట్యూడ్ అని తెలిసి బయటకు రావాలని అనుకున్నా రాలేకపోవడం, నెమ్మదిగా ధైర్యం చేసి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం వల్ల హీరో వైల్డ్ గా రియాక్ట్ కావడంతో అసలు సమస్య మొదలవుతుంది.
ఇక ఈ సినిమాలో దర్శకుడు రాహుల్ స్త్రీ స్వేచ్ఛ, మహిళా సాధికారత లాంటి కఠిన సిద్దాంతాలను చర్చించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఫిలాసఫీలు రెండువైపునా పదునున్న కత్తుల లాంటివి. ఈ సిద్దాంతాలకు అసలు అడ్డమే చెప్పకూడదు అనే ప్రస్తుత సమాజ ధోరణి, కోర్టులు ఇలాంటి విషయంలో ఇస్తున్న తీర్పుల ధోరణి కూడా ఈ కథ ద్వారా కనపడింది.
అమ్మాయిలు ఏం చేసిన కరెక్ట్.. కాలేజి హాస్టల్ లో ఇద్దరు అడల్ట్స్ అంగీకార పూర్వకంగా ఏమి చేసినా తప్పులేదు అనే సీన్ కూడా ఒకటి ఉంటుంది.ఈ విషయంలో ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు రావొచ్చు.దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా ఒక పాత్రలో నటించి స్త్రీ స్వేచ్ఛ గురించి మోతాదు మించకుండా తన సిద్ధాంతాలను వివరించడం బాగుంది.బహుశా డైరెక్టర్ మీద తన భార్య చిన్మయి ప్రభావం ఉండి ఉండొచ్చు.కథలో కీలకమైన సన్నివేశాలను అతను రాసుకున్న తీరు. తెరకెక్కించిన వైనం ఆకట్టుకుంటుంది.తన రాసిన డైలాగులు సినిమాలకు మేజర్ హైలైట్.“నీకు తను కాదు తన లాంటి అమ్మాయి కావాలి” “I ALREADY F..CKED YOU” లాంటి డైలాగులు పేలతాయి.
భూమా పాత్రలో రష్మిక మెప్పిస్తుంది.పతాక సన్నివేశాల్లో తన నట విశ్వరూపాన్ని చూస్తాం.ఇంకొంచెం సేపు ఆ సీన్ పరిధి ఎక్కువగా ఉంటే బాగుండేది అనిపించింది.దీక్షిత్ కూడా ఆశ్చర్యపరుస్తాడు.మంచి భవిష్యత్ ఉంది తనకు.సినిమాకు మలుపు అయ్యే దుర్గ పాత్రలో అను ఇమ్మానుయేల్ బాగుంది.ఆ పాత్ర ఉండేది కాసేపే అయినా మంచి ఇంపాక్ట్ ను ఇస్తుంది.భూమా తండ్రి పాత్రలో రావు రమేష్ పర్లేదు.తన పాత్ర ప్రవర్తించే తీరు ఎందుకో అయోమయంగా అనిపించింది.ప్రోఫెసర్ రాహుల్ రవీంద్రన్ తన ముద్ర చూపిస్తాడు.
ఇక సంగీతం విషయానికి వస్తే హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం బాగుంది.రెండు పాటలు కూడా బాగున్నాయి.ప్రశాంత్ విహారి ఇచ్చిన నేపధ్య సంగీతం పర్లేదు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ ఈ కాలేజీ థీమ్ కు తగ్గట్టుగా ట్రెండీగా ఉంది. ఈ సినిమా మీద అభిప్రాయాల పరంగా తేడాలు ఉండొచ్చు కానీ..డైరెక్టర్ తను చెప్పదలుచుకున్న పాయింట్ మాత్రం బలంగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు.
చివరగా..
“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా మాత్రమే కాదు..అందరూ ఒప్పుకోలేని బలమైన సిద్ధాంతం.
Sky C Rating : 2.75/5

