శివగామిని మార్చేసిన రాంగోపాల్ వర్మ: రమ్యకృష్ణ బోల్డ్ అవతార్ వైరల్

‘పోలీస్ స్టేషన్ మే భూత్’ చిత్రంలో రమ్యకృష్ణ పాత్ర పోషిస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా వెల్లడించారు. ఆయన విడుదల చేసిన ఫొటోలో రమ్యకృష్ణ చాలా బోల్డ్ గా , పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపించారు.

  • ఆమె స్లీవ్‌లెస్ టాప్, బ్లూ జీన్స్ ధరించి, భయంకరమైన కాటుక కళ్ళు, ముక్కు పుడక, మెడలో రుద్రాక్షలు లాంటి దండలు, మరియు నుదుటిపై వింత చుక్కల పచ్చబొట్టు తో కనిపించారు.
  • ఆమె లుక్‌ను చూస్తే, ఈ చిత్రంలో ఆమె ఒక మాంత్రికురాలిగా లేదా క్షుద్ర సాధన చేసే వ్యక్తిగా కనిపించవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

‘బాహుబలి’ సినిమాలో రాజమాత శివగామిగా రాజసం ఉట్టిపడే పాత్రలో కనిపించిన రమ్యకృష్ణ, అంతకు మించి భిన్నమైన, భయపెట్టే పాత్రను ఎంచుకోవడం . ఈ దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్‌గా మారాయి.

సత్య కాంబో రిపీట్: రొటీన్‌కు భిన్నంగా కాన్సెప్ట్

సుమారు ఐదేళ్ల తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు ఇష్టమైన హారర్-కామెడీ జానర్‌తో మెగా ఫోన్ పట్టడం సినీ అభిమానులను ఉత్సాహ పరుస్తోంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణతో పాటు బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పాయ్, జెనీలియా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం ‘సత్య’ (1998) తర్వాత దాదాపు మూడు దశాబ్దాల విరామం అనంతరం రామ్‌గోపాల్ వర్మ మరియు మనోజ్ బాజ్‌పాయ్ కలయికకు వేదిక కావడం విశేషం.

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఒక పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ దెయ్యంగా తిరిగి వచ్చి, తనను చంపిన పోలీసు అధికారి ఉన్న పోలీస్ స్టేషన్‌నే వెంటాడటం ఈ చిత్రం యొక్క ప్రధాన కాన్సెప్ట్.”మనం భయపడితే పోలీసుల దగ్గరకు పరుగెత్తుతాం. మరి పోలీసులే భయపడితే ఎక్కడికి పరుగెత్తుతారు?” అనే భయానక ఆలోచన ఆధారంగా ఈ థ్రిల్లర్‌ను రూపొందించినట్లు వర్మ తెలిపారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a comment