‘ఈనాడు’ సంచలన నిర్ణయం : న్యూస్ లింక్‌లు పెట్టొద్దు.. లేదంటే క్రిమినల్ కేసులే!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలపై పత్రికల ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ప్రముఖ దినపత్రిక ‘ఈనాడు’ తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. పత్రిక మరియు వెబ్‌సైట్‌కు చెందిన న్యూస్ లింక్‌లను, కంటెంట్‌ను సోషల్ మీడియాలో పెట్టకూడదు అని, ఒకవేళ పెడితే లీగల్‌గా క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ ఈనాడు యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఎందుకు ఈ లీగల్ అస్త్రం?

సాధారణంగా ఏ మీడియా సంస్థ అయినా తమ కంటెంట్‌ను మరింత మందికి చేరవేయాలని కోరుకుంటుంది. కానీ, ఈనాడు మాత్రం అందుకు విరుద్ధంగా లింక్‌ల షేరింగ్‌ను అడ్డుకోవాలని చూడడం వెనుక బలమైన కారణం ఉంది.

ఈనాడు పత్రికలోని వార్తలు, కథనాలు TDP పార్టీకి అనుకూలంగా,YSRCP కి ప్రతికూలంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. YSRCP కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆ కథనాలను షేర్ చేసి విమర్శలు చేస్తూ పత్రిక ఉనికిని,విశ్వసనీయతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఈనాడు యాజమాన్యం గుర్తించింది.

ఈనాడు తీసుకున్న ఈ లీగల్ చర్య, ఆ పత్రిక ఎంతటి ఒత్తిడిలో ఉందో, తమ కంటెంట్‌పై ఎంతగా ఆందోళన చెందుతోందో స్పష్టం చేస్తోంది. ఈ వివాదం సోషల్ మీడియాలో మరింత వేడెక్కుతోంది.

Leave a comment