“నా కొడుకు మెడ విరిచేశారు”: రియాజ్ తల్లి సంచలన, భావోద్వేగ ఆరోపణలు!

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడైన షేక్ రియాజ్ తల్లి సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకును దారుణంగా హింసించి చంపేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

“నా కొడుకు మెడ విరిచేశారు.. పొట్టలో నుండి పేగులు బయటకు వచ్చాయి. దారుణంగా చంపేశారు,” అని ఆమె ఆరోపించారు.

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో రియాజ్ ప్రధాన నిందితుడు. అయితే, ఈ ఆరోపణను అతని తల్లి సవాల్ చేశారు. “నా కొడుకు నిజంగా హంతకుడు అయితే ఆ ఆధారాలు చూపించండి.. నాకు మనశ్శాంతిగా ఉంటుంది,” అని ఆమె వేడుకున్నారు.

బిడ్డను కోల్పోయిన బాధను ఆమె వ్యక్తం చేశారు. “ఏ తల్లికైన కొడుకు కొడుకేగా.. నా కొడుకుకు జరిగినట్లు ఎవరికి జరగకూడదు,” అని ఆమె విలపించారు.

అంతేకాకుండా, అంతిమయాత్ర గురించి ఆమె ఒక షాకింగ్ ఆరోపణ చేశారు. “నా కొడుకు చనిపోయినప్పుడు, అంతిమ యాత్రలో తీసుకెళ్తుంటే పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు,” అని ఆమె వాపోయారు.

అంత్యక్రియల సమయంలో కూడా వేధింపులకు గురయ్యామని ఆమె ఆరోపించారు. “నా కొడుకు అంతిమ యాత్రలో పోలీసులు వచ్చి ఎక్కడా ఆగనివ్వకుండా పంపించేశారు.”

శ్మశాన వాటికలోనూ అవమానం జరిగిందని ఆమె అన్నారు. “శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేస్తుంటే, ఇక్కడ చేయకూడదు అని వెళ్లగొట్టారు,” అని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవరి కొడుకుకైనా ఇలాంటి పరిస్థితి రాకూదదు,” అంటూ రియాజ్ తల్లి కంటతడి పెట్టారు. చిత్రహింసలు, అంత్యక్రియలకు ఆటంకం వంటి ఆమె ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Leave a comment