బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 122 మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దాటేసింది.
ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే, తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులోనూ ఎన్డీఏ కూటమి ముందంజలో కొనసాగింది. అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపులోనూ అదే జోరును ప్రదర్శిస్తూ, ప్రస్తుతం 130కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది.
మరోవైపు, ఆర్జేడీ-కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ‘మహాఘట్బంధన్’ (ఇండియా కూటమి) కేవలం 100 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో ఉండి వెనుకబడింది.
ఎన్డీఏ విజయం దాదాపు ఖాయం కావడంతో, బీజేపీ, జేడీయూ కార్యాలయాల వద్ద కార్యకర్తలు సంబరాలు ప్రారంభించారు. స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ విజయోత్సాహాన్ని జరుపుకుంటున్నారు.

