రవితేజకు ‘మాస్ మహారాజా’ బిరుదు భారం

‘సింధూరం’ నుండి ‘నా ఆటోగ్రాఫ్’ వరకు ట్రెండ్ సెట్ చేసి… ఇప్పుడు ఒకే మూసలో పడిపోవడంపై రవితేజ అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన స్టైల్, ఎనర్జీతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు రవితేజ. అయితే, ఇటీవల కాలంలో ఆయన సినిమాల ఎంపికపై ఆయన అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, ‘మాస్ మహారాజా’ అనే బిరుదు రవితేజను ఒకే రకమైన కథాంశాలలో బంధించివేస్తోందని, దీనివల్ల నాణ్యమైన కంటెంట్ తగ్గిపోతోందని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

బిరుదును పక్కన పెట్టండి.. ప్రయోగాలు చేయండి

మాస్ మహరాజ్ టైటిల్ తగిలించుకున్న దగ్గర నుండి ఒకటే మూస లో పడిపోయి క్రింజ్ చేస్తున్నాడు రవితేజ . ఇలా ఒక రొట్ట ఫార్మేట్ లో పడిపోయి క్రింజ్ కంటెంట్ జనాల మీద కి వదలడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

రవితేజ స్వశక్తితో ఎదిగిన తీరును గుర్తుచేస్తూ, చిరంజీవి గారి తర్వాత ఆ స్థాయిలో నిలబడిన పేరు రవితేజ దే.‘సింధూరం’,’ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’, ‘ఖడ్గం’, ‘నేనింతే’, ‘నా ఆటోగ్రాఫ్’ లాంటి సినిమాలు తెలుగు సినిమాలో ఎవరూ టచ్ చేయలేని విభిన్న జోనర్స్ కూడా రవితేజ టచ్ చేసి మెప్పు పొందారు.

బిరుదుల భారం.. సృజనాత్మకతకు సంకెళ్లు

సినిమా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మాస్ ఇమేజ్ కోసం కొన్ని పరిమితులకు లోబడి కథలను ఎంచుకోవడం వల్ల నటుడిలోని సృజనాత్మకత మరుగున పడిపోయే అవకాశం ఉంది.

రవితేజ వంటి సహజ నటుడు కేవలం మాస్ యాక్షన్ లేదా ఫుల్ లెంగ్త్ కామెడీకే పరిమితం కాకుండా, మళ్లీ బలమైన పాత్రలు ఉన్న కథలను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అభిమానులు కోరుకునేది రొటీన్ ఫైట్లు, పాటలు కాదు… ఆయన నటనా కౌశలాన్ని మరోసారి నిరూపించే కొత్తదనం నిండిన కథాంశాలు కూడా ముఖ్యమే.ఆయన మళ్లీ ఒకప్పటిలా ప్రయోగాత్మక చిత్రాల వైపు అడుగులు వేయాలని సినీ ప్రేమికులందరూ ఆశిస్తున్నారు. నటుడిగా తన స్థాయిని నిలబెట్టుకోవడానికి కేవలం మాస్ బిరుదు కాకుండా, కథాబలమే ముఖ్యమని రవితేజ తెలుసుకుంటే తన కెరీర్ కు మంచిది.

Leave a comment