BREAKING: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం! కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాటలో 9 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, కాశీబుగ్గలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఈ ఉదయం (శనివారం) పెను విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరగడం వలన 9 మంది భక్తులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం.

ప్రమాదానికి కారణాలు:

  • కార్తీక మాసం, ఏకాదశి పర్వదినాలు కావడంతో, వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.భక్తుల రద్దీని తట్టుకోలేక ఆలయ ప్రాంగణంలోని రెయిలింగ్‌ విరిగిపోవడంతో పలువురు భక్తులు కిందపడటం, గందరగోళం ఏర్పడటం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ స్పందన:

  • ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందనిపేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన, సత్వర చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సరైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Leave a comment