‘ఓజీ’ చిత్రం తెలుగు వెర్షన్ నుంచే 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది, మొదటి రోజు ఓపెనింగ్ 150 కోట్లకు పైగా వచ్చింది. ఈ స్థాయిలో ఓపెనింగ్స్, క్లోజింగ్ కలెక్షన్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‌కు’ వస్తాయా అనేది ప్రధాన ప్రశ్న.
ట్రేడ్ విశ్లేషణ ప్రకారం..
ఒకప్పటిలాగా ఇప్పుడు ఆడియన్స్ రొటీన్ కమర్షియల్ మాస్ సినిమాలను అంతగా ఆదరించడం లేదు. పవన్ కళ్యాణ్ వంటి సూపర్ స్టార్స్ నుంచి కూడా ప్రేక్షకులు ‘ఓజీ’, ‘సలార్’ లాంటి భారీ బడ్జెట్, ప్యాన్-ఇండియా స్థాయి చిత్రాలనే కోరుకుంటున్నారు.
నైజాం వంటి ప్రాంతాల్లో ప్రేక్షకులు కమర్షియల్ మాస్ సినిమాలను చూడటం దాదాపుగా మానేశారు. వారు కేవలం పాన్ ఇండియన్ సినిమాలను మాత్రమే చూస్తున్నారు. అందువల్ల, ఈ రెండు ముఖ్యమైన ప్రాంతాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు ‘ఓజీ’కి వచ్చినంత కలెక్షన్లు రావడం అసాధ్యం.
పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తన భాగం షూటింగ్‌ను పూర్తి చేయగా, ప్రస్తుతం ఇతర సన్నివేశాల ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
‘ఓజీ’ ఇచ్చిన జోష్‌ను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉపయోగించుకుని, అభిమానుల అంచనాలను, బాక్సాఫీస్ టార్గెట్‌ను ఏ మేరకు అందుకుంటాడో చూడాలి.


పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ .. మీకు జోహార్లు.!
on October 31, 20250