దాదాపు 30 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం మరియు దాదాపు 10 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానం కలిగిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.అలాంటి విచిత్ర పరిస్థితులు అంగరంగ వైభవంగా తన రాజకీయ పార్టీ జనసేన స్థాపన రోజు నుంచే పురుడు పోసుకోవడం మొదలెట్టాయి.
వివరంగా చెప్పాలి అంటే..!
తెలుగు చిత్రపరిశ్రమ లో ఎన్టీఆర్-ఎఎన్ఆర్-కృష్ణ లాంటి స్టార్ ల కెరీర్ అంకంలో చిరంజీవి అనే కొత్త స్టార్ పుట్టుకొచ్చాడు.తన వైవిధ్యమైన నటన మరియు డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించి మెగాస్టార్ గా మారడమే కాదు.కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి.
ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా పవన్ కళ్యాణ్ కూడా తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యారు.అతి తక్కువ కాలంలో తనకే సాధ్యమైన స్వాగ్ తో జయాపజయాలతో సంబంధం లేకుండా పవర్ స్టార్ గా ఎదిగారు ఆయన.అంతవరకూ సాఫీగా సాగిన పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ అన్న చిరంజీవి గారు కొత్తగా పెట్టిన “ప్రజారాజ్యం” పార్టీతో మలుపు తీసుకుంది.
80,90 దశకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు NTR మరియు వారి వారసులను మాత్రమే తలకెత్తుకోగా..కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ గారిని తమ హీరోగా తలకెత్తుకున్నారు. అంతేకాకుండా మెజారిటీ కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సవాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలతో పాటు మెగాస్టార్ పాటలు కూడా ప్రదర్శించే వారు.ఆ విధంగా కాంగ్రెస్ జనాల్లో చిరంజీవి గారి మీద సాప్ట్ కార్నర్ మొదటి నుంచీ ఉండేది. 2009 సంవత్సరం ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు అయ్యేవరకు ఈ సంప్రదాయం కొనసాగింది.ఇక అప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం కొత్త పుంతలు తొక్కడం మొదలయింది.
కాంగ్రెస్ (ఇప్పుడు వైస్సార్ కాంగ్రెస్) అంటే రెడ్ల పార్టీ అని ,తెలుగుదేశం అంటే కమ్మవారి పార్టీ అని రాజకీయ విశ్లేషకులు బహిరంగంగా చెప్పే మాట.కాపు కులస్థులు కూడా అధికభాగం కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా ఉండేవారు కానీ, “ప్రజారాజ్యం” రాకతో ఆ రెండు అగ్ర కులాల కంటే ఎక్కువ జనం కలిగిన కాపు సామాజిక వర్గం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి వైపుకు తిరిగింది.
ఆ సామాజికవర్గం ఒక్కసారైనా తమ కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని 2009 అసెంబ్లీ ఎలక్షన్స్ లో గట్టిగానే ప్రజారాజ్యం వైపు నిలబడ్డారు.కానీ అప్పుడు టీడీపీ ఓటమికి ప్రజారాజ్యం పరోక్షంగా ఉపయోగపడింది తప్ప కాపు కులస్థులు కోరుకున్నది జరగలేదు.ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిన తెరిసిన పుస్తకమే.
అక్కడ ఆగిన ఆ సామాజిక వర్గం “కోరిక” చాన్నాళ్లకు జనసేన పార్టీ స్థాపనతో మళ్ళీ పురుడు పోసుకుంది.కానీ పవన్ అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏ ఒక్క అసెంబ్లీ సీటులో పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీ లకు మద్దతు ప్రకటించి తనే తెలుగుదేశం గెలుపునకు ముఖ్య కారణం అయ్యాడు.పవన్ పిలుపు మేరకు ఇష్టం లేకపోయినా కాపు సామాజిక వర్గం కొంతభాగం టీడీపీ కూటమికి మద్దతు తెలిపారు.
ఇలా మూడు రాజకీయ పార్టీలు మూడు కుల రాజకీయ పార్టీలు గా మారాయి.
2019 లో అన్నీ పార్టీలు విడివిడిగా నిలబడటంతో బంపర్ మెజార్టీ తో వైఎస్ఆర్సిపి గెలవడం జనసేన ఘోరంగా ఓడిపోవడంతో సినిమాల పరంగా కూడా పవన్ పతనం మొదలైంది.ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రస్థానంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి.టీడీపీ కార్యకర్తలు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ కార్యకర్తలకు మెగా సినిమాలకు ఎప్పుడూ దూరమే.తర్వాత జనసేన రూపంలో మెగా అభిమానులు రాజకీయ మద్దతు ఇచ్చినా టీడీపీ వాళ్ళు మాత్రం సినిమాల పరంగా ఇంతకు ముందు లాగే మెగా సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.
ఇక వైఎస్సార్సీపీ జనసేన కార్యకర్తలు బద్ద శత్రువులు గా మారడం వలన వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా దూరడం జరిగింది.దూరంగా మాత్రమే కాదు “బాయ్ కాట్” ట్రెండింగ్ తో పవన్ సినిమాలకు నెగెటివ్ ప్రచారం అయ్యేలా తమ వంతు ప్రయత్నం తాము చేశారు.చేస్తున్నారు.చేస్తారు.
అప్పటి నుంచి పవన్ తీసిన సినిమాలు కలెక్షన్స్ పరంగా హిట్ సినిమాలు యావరేజ్ గా,యావరేజ్ సినిమాలు ఫ్లాప్ లుగా మారడం మొదలైంది.జనసేన పార్టీకి మద్దతు బలంగా గొంతు వినిపించే మెగా హీరోలు వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ (సాయి దుర్గ తేజ్) ల పరిస్థితి అయితే మరీ దారుణం.
భీమ్లా నాయక్,వకీల్ సాబ్ లాంటి సినిమాల ఫలితాలు గమనిస్తే అర్థమవుతుంది.ఆ రెండు పార్టీలు ఆ రెండు సామాజిక వర్గాలు మెజారిటీ భాగం బహిష్కరణ కారణంగా హిట్ అవ్వాల్సిన సినిమాలు యావరేజ్ గా మారడం గమనించాలి.
కేవలం పవన్ అభిమానులు మాత్రమే పవన్ సినిమాలను తమ భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నారు.ఇది వాళ్ళకి కూడా తెలుసు.
అంతెందుకు పవన్ చాణక్యం తో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా OG విషయంలో ఆ రెండు పార్టీల నెగెటివ్ ప్రచారం ఏ స్థాయిలో గమనించవచ్చు.OG ప్రీమియర్స్ టికెట్స్ పెంపు ధరలతో ఆ సినిమా మెల్లగా గట్టెక్కింది కానీ ఈ సినిమా కూడా యావరేజ్ స్థాయికి ఆగిపోయేదే.
సినిమాల పరంగా జన సైనికులు మాత్రమే పవన్ కు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అండగా నిలబడ్డారు నిలబడతారు.
అలాంటి జనసైనుకుల సంక్షేమం-ప్రాధాన్యత విషయంలో ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ ముందుండాలి.ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు వాళ్ళే సైనికులు మరియు నిజమైన బంధువులు..!✨
—MB


బ్రహ్మానందంపై రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్: ‘ముసలి ము***డా కొడుకు’!
on November 30, 20250