‘They Call Him OG’ రిపోర్ట్: నైజాం మినహా అన్ని ప్రాంతాల్లో నష్టాలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  నటించిన ‘They Call Him OG’ చిత్రం యొక్క తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల ప్రకారం ఈ చిత్రం నిజాం ప్రాంతం మినహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో నష్టాలను చవిచూసినట్లు సమాచారం. 

‘OG’ చిత్రం యొక్క తెలుగు రాష్ట్రాల బిజినెస్ సుమారు 134 కోట్లు జరిగింది. కానీ సినిమా కలెక్ట్ చేసిన వసూళ్లు షేర్ 128.2 కోట్లు.ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను చేరుకోగలిగింది. అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లోని పంపిణీదారులు మాత్రం నష్టాలు ఎదుర్కొన్నట్లు కలెక్షన్ లు స్పష్టం చేస్తున్నాయి .

ప్రాంతాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

  • నైజాం (తెలంగాణ): ఈ ఏరియాలో హక్కుల విలువ ₹54 కోట్లు కాగా, చిత్రం ఏకంగా ₹57 కోట్ల షేర్ సాధించి, డిస్ట్రిబ్యూటర్లకు స్వల్పంగా లాభాలను అందించింది.
  • సీడెడ్: ఇక్కడ హక్కుల విలువ ₹20 కోట్లు ఉండగా, షేర్ కేవలం ₹18 కోట్లు మాత్రమే వచ్చింది.
  • ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతంలో ₹20 కోట్ల రైట్స్‌కు, సినిమా ₹17 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
  • గుంటూరు: ₹13 కోట్ల హక్కులకు, ₹11.6 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది.
  • పశ్చిమ గోదావరి: ₹10 కోట్ల రైట్స్‌కు, ₹8.8 కోట్ల షేర్ వచ్చింది.
  • నెల్లూరు: ఈ ప్రాంతంలో ₹6 కోట్ల హక్కుల విలువకు, ₹4.8 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది.
  • కృష్ణ: ₹11 కోట్ల హక్కులకు, ₹10 కోట్ల షేర్ రాబట్టింది.

Leave a comment