ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అన్నట్లు, రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేందుకు ‘ది రాజా సాబ్’ నుండి ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ బయటికి వచ్చింది. డైరెక్టర్ మారుతి ఎప్పటినుండో ఊరిస్తున్నట్లుగానే, ప్రభాస్‌ని మనం ఎంత స్టైలిష్‌గా, ఎంత ఎనర్జిటిక్‌గా చూడాలనుకున్నామో అలానే చూపించారు.
ఈ పాటకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. థియేటర్ల పైకప్పులు లేచిపోవాల్సిందే! లిరికల్ వీడియోలో ప్రభాస్ లుక్స్ చూస్తుంటే ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’ రోజుల నాటి ఆ ఛార్మ్ మళ్ళీ కళ్ళముందు కదలాడుతోంది. కలర్ ఫుల్ షర్ట్, బ్లాక్ జీన్స్ వేసుకొని ప్రభాస్ వేసిన మాస్ స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లిరిక్స్ లో “ఇండియా నెంబర్ 1” అంటూ వచ్చే లైన్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. సంజిత్ హెగ్డే, బ్లేజ్ గాత్రం పాటకు మరింత జోష్ నింపింది.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్‌గా జరిగింది. పేపర్లు ఎగరేస్తూ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మారుతి మార్క్ కామెడీ, హారర్ ఎలిమెంట్స్, ప్రభాస్ స్టార్డమ్ అన్నీ కలిపి ఈ సంక్రాంతికి (జనవరి 9, 2026) బాక్సాఫీస్ దగ్గర ‘రాజా సాబ్’ జాతర ఖాయం అనిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం కావడంతో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మొత్తానికి ‘రెబల్ సాబ్’తో సంక్రాంతి రేసులో ప్రభాస్ కర్చీఫ్ వేసేసినట్టే!

