ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తో వచ్చేశాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గ్లామర్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. వివేక్-మెర్విన్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలవగా, టీజర్, ట్రైలర్లకు ఆడియెన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నేడు (నవంబర్ 28) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కూడా డీసెంట్‌గా జరిగింది.
‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు (కోట్లలో):
నైజాం: రూ. 8.5 కోట్లు
సీడెడ్: రూ. 2.5 కోట్లు
ఆంధ్రా (మొత్తం): రూ. 9 కోట్లు
తెలుగు రాష్ట్రాలు (AP/TG Total): రూ. 20 కోట్లు
రెస్టాఫ్ ఇండియా (ROI): రూ. 1.8 కోట్లు
ఓవర్సీస్: రూ. 3.2 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం (Total WW): రూ. 25 కోట్లు (షేర్)
రామ్ మార్కెట్ స్టామినాతో పోలిస్తే రూ. 25 కోట్ల బిజినెస్ అనేది చాలా సేఫ్ గేమ్ అని చెప్పొచ్చు. సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి వెళ్లాలంటే బాక్సాఫీస్ వద్ద రూ. 25.5 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. రామ్ గత చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నా, ఆయనకు మాస్, యూత్‌లో ఉన్న క్రేజ్ వేరు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, ఈ టార్గెట్‌ను రామ్ మొదటి వారాంతంలోనే అందుకోవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ‘ఆంధ్రా కింగ్’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

