గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గరే కాదు, యూట్యూబ్‌లోనూ తన పవర్ చూపిస్తున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పెద్ది’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది. నవంబర్ 7న విడుదలైన ఈ పాట, కేవలం మూడు వారాల్లోనే ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ (10 కోట్ల వీక్షణాలు) క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
“ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే క్లాస్ అనుకున్నాం.. కానీ ఇలా మాస్ బీట్తో ఇరగదీస్తారని ఎవరూ ఊహించలేదు” అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి రామ్ చరణ్ వేసిన ఆ ‘బ్యాటింగ్ షాట్’ హుక్ స్టెప్ ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. రీల్స్, షార్ట్స్ ఎక్కడ చూసినా ‘చికిరి’ వైబే కనిపిస్తోంది.
ఈ 100 మిలియన్ల వ్యూస్‌లో కేవలం తెలుగు వెర్షన్ నుంచే దాదాపు 64 మిలియన్లు రావడం విశేషం. ఇక హిందీలోనూ చెర్రీ క్రేజ్ మామూలుగా లేదు, అక్కడ కూడా 25 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. జాన్వీ కపూర్ గ్లామర్, చరణ్ రగ్గడ్ లుక్, రెహమాన్ మ్యాజికల్ ఫోక్ బీట్.. వెరసి ‘పెద్ది’ ఆల్బమ్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 2026 మార్చిలో సినిమా రాబోతోంది కానీ, ఇప్పుడే రికార్డుల వేట మొదలైపోయింది. “మొదట్లోనే ఇలా ఉంటే.. సినిమా రిలీజయ్యాక బాక్సాఫీస్ పరిస్థితి ఏంటో!” అని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి చెర్రీ.. ‘చికిరి’తో గట్టిగానే కొట్టాడు!

