టాలీవుడ్ రీ-రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. ఖలేజా,బాహుబలి అంటూ స్టార్ హీరోల సినిమాలతో బాక్సాఫీస్ దద్దరిల్లిపోతున్న వేళ.. ఇప్పుడు ఒక ఫీల్ గుడ్ క్లాసిక్ ఆడియెన్స్‌ను పలకరించడానికి రెడీ అయ్యింది. అదే దివంగత హీరో, లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘మనసంతా నువ్వే’.
2001లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఉదయ్ కిరణ్ క్రేజ్‌ను డబుల్ చేసిన సినిమా ఇది. “తూనీగా తూనీగా..” అంటూ సాగే పాట ఇప్పటికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎమోషనల్ లవ్ స్టోరీని సరికొత్త టెక్నాలజీతో మళ్ళీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.
వాలెంటైన్స్ డే స్పెషల్.. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14, 2025న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నారు. కేవలం పాత ప్రింట్‌ను వేయడం కాకుండా, లేటెస్ట్ 4K క్వాలిటీ, డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్ సిస్టమ్‌తో ఈ సినిమాను రీ-మాస్టర్ చేశారు. అంటే, ఆ క్లైమాక్స్ ఎమోషన్, ఆర్.పి. పట్నాయక్ మ్యూజిక్ మ్యాజిక్ ఇప్పుడు మరింత క్లియర్‌గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చన్నమాట.
వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో, ఎం.ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో యువతను ఉర్రూతలూగించింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించిన ఈ సినిమాలో చంటి-అనుల చిన్ననాటి ఎపిసోడ్, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఇప్పటికీ ఫ్రెష్‌గానే అనిపిస్తాయి. ముఖ్యంగా సునీల్ కామెడీ, తనికెళ్ళ భరణి సెంటిమెంట్ సీన్స్ సినిమాకు ప్రధాన బలం.
గతంలో ఉదయ్ కిరణ్ నటించిన ‘నువ్వు నేను’ రీ-రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘మనసంతా నువ్వే’ కూడా అదే రేంజ్లో థియేటర్లను షేక్ చేస్తుందని ఆశిస్తున్నారు. సో, ఈ వాలెంటైన్స్ డేకి మీ లవర్‌తో కలిసి ‘చంటి’ గాడి ప్రేమకథను మళ్ళీ చూసేయండి!

