వైజాగ్ ఇక ‘డేటా’ బాస్! అదానీ, అంబానీ, గూగుల్.. క్యూ కట్టిన లక్షల కోట్లు!

ఒకప్పుడు విశాఖపట్నం అంటే అందమైన బీచ్‌లు, ఉక్కు కర్మాగారం మాత్రమే గుర్తొచ్చేవి. కానీ సీన్ మారుతోంది బాస్! ఇప్పుడు వైజాగ్ అంటే ‘డేటా’. అవును, మీరు వింటున్నది నిజమే. మన విశాఖ నగరం భారతదేశపు తదుపరి “బిగ్ డేటా క్యాపిటల్”గా అవతరిస్తోంది. ప్రపంచం మొత్తం డిజిటల్ మాయలో ఉంటే, ఆ డిజిటల్ ప్రపంచానికి గుండెకాయ లాంటి డేటా సెంటర్లు మాత్రం మన వైజాగ్‌లో కొలువుదీరుతున్నాయి.

విషయం సింపుల్. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్, బెంగళూరు అంటేనే ఐటీ అనుకునేవాళ్లం. ఇప్పుడు వైజాగ్ ఆ లిస్టులో టాప్‌లో కూర్చోబోతోంది. దీనికి కారణం మామూలు వాళ్లు కాదు.. గూగుల్ , అదానీ, రిలయన్స్ లాంటి బడా బాబులు.

  • గూగుల్ & అదానీ కాంబో: వీళ్లిద్దరూ కలిసి ఏకంగా 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడితో భారీ ఏఐ (AI) డేటా సెంటర్ హబ్‌ను వైజాగ్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే టాప్ క్లాస్ ప్రాజెక్ట్.

  • రిలయన్స్ ఎంట్రీ: అదానీ ఉన్నచోట అంబానీ ఉండకుండా ఉంటారా? రిలయన్స్ జియో, బ్రూక్‌ఫీల్డ్ కలిసి ‘డిజిటల్ కనెక్షన్’ పేరుతో మరో 11 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 98,000 కోట్లు) పెట్టుబడిని ప్రకటించాయి. 400 ఎకరాల్లో 1 గిగావాట్ (GW) డేటా సెంటర్ రాబోతోంది.

ఎందుకు వైజాగ్?

అసలు వీళ్లంతా వైజాగ్‌పై ఎందుకు పడ్డారు? అనే కదా మీ డౌట్. వైజాగ్ కు ఉన్న అతి పెద్ద అడ్వాంటేజ్ ‘సముద్ర తీరం’. ఇంటర్నెట్ అంటే ఆకాశం నుంచి ఊడిపడేది కాదు, సముద్రం అడుగున ఉండే భారీ కేబుల్స్ ద్వారా వస్తుంది . ఈ కేబుల్స్ ల్యాండింగ్ పాయింట్‌గా వైజాగ్ సూపర్ ప్లేస్ అన్నమాట. దీనివల్ల డేటా స్పీడ్ (Latency) అదిరిపోతుంది. అందుకే మెటా  కూడా ఇక్కడ భారీ స్కెచ్ వేసింది.

ఉద్యోగాల వెల్లువ..!

ఈ ప్రాజెక్టుల వల్ల కేవలం బిల్డింగులే కాదు, వేల సంఖ్యలో హై-ఎండ్ టెక్ ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు తోడుగా, ఈ డేటా సెంటర్లు వైజాగ్‌ను “టైర్-1” సిటీగా మార్చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం టార్గెట్ 2030 నాటికి 6 గిగావాట్ల కెపాసిటీ. అంటే వైజాగ్ స్పీడ్ మామూలుగా ఉండదు మరి.!

Leave a comment