ఓటీటీలో ‘మాస్ జాతర’.. ఈ వీకెండ్ 20 సినిమాలు రిలీజ్.. లిస్ట్ ఇదే!

సినిమా లవర్స్‌కి ఈ వీకెండ్ నిజంగానే ‘మాస్ జాతర’ అని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర సందడి తగ్గిన వేళ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మాత్రం కొత్త కంటెంట్‌తో హోరెత్తిస్తున్నాయి. నవంబర్ 28 (శుక్రవారం) ఒక్కరోజే ప్రముఖ ఓటీటీల్లో ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి దిగుతున్నాయి. వీటిలో రవితేజ ‘మాస్ జాతర’తో పాటు గ్లోబల్ సెన్సేషన్ ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ ఉండటం విశేషం.

ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ ఈ వారం జాక్‌పాట్ కొట్టేసింది. థియేటర్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న రవితేజ సినిమా ‘మాస్ జాతర’ నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మాస్ మహారాజా ఫ్యాన్స్‌కి ఇది గుడ్ న్యూస్. ఇక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 (వాల్యూమ్ 1)’ కూడా స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. మరోవైపు బాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ (వరుణ్ ధావన్, జాన్వీ కపూర్) కూడా నెట్‌ఫ్లిక్స్ లిస్ట్‌లో చేరిపోయింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా తగ్గేదేలే అంటోంది. రిషబ్ శెట్టి సృష్టించిన విజువల్ వండర్ ‘కాంతార: ఏ లెజెండ్ చాప్టర్ 1’ (హిందీ వెర్షన్) ఎట్టకేలకు స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఇక రాజ్ తరుణ్ నటించిన ‘పాంచ్ మినార్’ సినిమా రిలీజైన వారం రోజుల్లోనే (నవంబర్ 28న) సైలెంట్‌గా ప్రైమ్‌లో దర్శనమివ్వడం షాకింగ్ ట్విస్ట్.

ఈ వారం ఓటీటీ రిలీజ్ లిస్ట్ ఇదే:

నెట్‌ఫ్లిక్స్ (Netflix):

  1. మాస్ జాతర (తెలుగు) – స్ట్రీమింగ్ అవుతోంది
  2. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 (వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతోంది
  3. ఆర్యన్ (తెలుగు డబ్బింగ్) – నవంబర్ 28
  4. లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ – నవంబర్ 28
  5. సన్నీ సంస్కారి కి తులసి కుమారి (హిందీ) – స్ట్రీమింగ్ అవుతోంది

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime):

6. కాంతార చాప్టర్ 1 (హిందీ) – స్ట్రీమింగ్ అవుతోంది 7. పాంచ్ మినార్ (తెలుగు) – స్ట్రీమింగ్ అవుతోంది 8. బ్లూ మూన్ – స్ట్రీమింగ్ అవుతోంది

సన్ నెక్స్ట్ (Sun NXT): 9. శశివదనే (తెలుగు) – నవంబర్ 28

జీ5 (Zee5): 10. ది పెట్ డిటెక్టివ్ (మలయాళం) – నవంబర్ 28 11. రక్తాబీజ్ 2 (బెంగాలీ) – నవంబర్ 28

ఈటీవీ విన్ (ETV Win): 12. కరీముల్లా బిర్యానీ పాయింట్ – నవంబర్ 30

మొత్తానికి ఈ వీకెండ్ ఇంట్లో కూర్చొని బిర్యానీ లాగిస్తూ, ఇష్టమైన సినిమాలు చూసేయండి. ‘మాస్ జాతర’తో మాస్ కిక్, ‘స్ట్రేంజర్ థింగ్స్’తో థ్రిల్ గ్యారెంటీ!

Leave a comment