మిస్టర్ బచ్చన్ సినిమాలో కుర్రకారు క్రష్‌గా ఓవర్‌నైట్ పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. అందం, గ్లామర్ షో విషయంలో ఈ అమ్మాయికి మార్కులు బాగానే పడుతున్నాయి కానీ..బాక్సాఫీస్ అదృష్టం మాత్రం ఆమెకు ఆమడ దూరంలో ఆగిపోయింది.
టాలీవుడ్లో అడుగుపెట్టినప్పటి నుంచి భాగ్యశ్రీ ఖాతాలో హిట్టు అన్న సౌండ్ వినిపించనేలేదు. కెరీర్ స్టార్టింగ్‌లోనే వరుస ప్లాపులతో ఈ హీరోయిన్ కెరీర్ డైలమాలో పడింది.
నాలుగు సినిమాలతో నాలుగో పరాజయం
రవితేజ సరసన చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది భాగ్యశ్రీ. ఈ సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్ అయినప్పటికీ, ఆమె నటనకు SIIMA బెస్ట్ డెబ్యూ అవార్డు వచ్చింది. కానీ, బాక్సాఫీస్ లెక్కల్లో ఈ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.
తరువాత విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో హీరోయిన్ ఆశలు అడియాశలయ్యాయి.
ఆమె ఆశలన్నీ ఇక తమిళ/తెలుగు బైలింగ్వల్ అయిన ‘కాంత’ చిత్రంపైనే ఉండేవి. దుల్కర్ సల్మాన్, రానా వంటి స్టార్స్‌తో నటించిన ఈ పీరియడ్ థ్రిల్లర్ నవంబర్ 14న విడుదలైంది. నటనకు ప్రశంసలు దక్కినా… బాక్సాఫీస్ వద్ద మాత్రం మరో ప్లాప్ టాక్ పలకరించింది. అసలు ఈ ‘కాంత’ సినిమానే తన తొలి సౌత్ ఇండియన్ సినిమా కావాల్సిందని భాగ్యశ్రీ గతంలో చెప్పడం విశేషం.
ఆంధ్ర కింగ్ తాలూకా కూడా డల్‌గా..!
ఇక రీసెంట్గా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka)పై ఆమె చాలా నమ్మకం పెట్టుకుంది. నవంబర్ 27న విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్స్ వద్ద, ఓవర్సీస్లో మంచి టాక్ వచ్చింది. రామ్, భాగ్యశ్రీ కూడా ప్రమోషన్స్ కోసం యూఎస్‌కు వెళ్లి గట్టిగానే ప్రచారం చేశారు.
అయితే, ఆరంభంలో వచ్చిన బజ్ ఆ తర్వాత నిలబడలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డిజాస్టర్ దిశగా పయనిస్తుండగా.. భాగ్యశ్రీ ఖాతాలో నాలుగో భారీ పరాజయం వచ్చి చేరింది. హిట్టు కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు పదేపదే బెడిసికొడుతున్నాయి.
ఇక ఆశలన్నీ ‘లెనిన్’పైనే..!
వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న భాగ్యశ్రీకి ఇప్పుడు ఉన్న ఏకైక ఆశ యువ హీరో అఖిల్ అక్కినేని సినిమా ‘లెనిన్’ . మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ డ్రామాలో శ్రీలీల ప్లేస్‌లో ఆమె వచ్చి చేరింది.
నాగార్జున నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై అక్కినేని అభిమానులు కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతోనైనా భాగ్యశ్రీ కెరీర్‌కు ఊపునిచ్చే తొలి హిట్ దక్కుతుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం సినీ పరిశ్రమ మొత్తం ఆమె అదృష్టం లెనిన్తో మారుతుందా అని ఆసక్తిగా చూస్తోంది. ఈ ‘అయ్యగారు’ భాగ్యశ్రీకి బ్రేక్ ఇస్తారో లేదో కాలమే సమాధానం చెప్పాలి!

