ధనుష్ హార్ట్ ఛైంజ్ అయ్యిందా? ఆ స్టార్ స్టార్ హీరోయిన్ ప్రేమలో.!?

టాలీవుడ్, బాలీవుడ్ మధ్య రాకపోకలు పెరిగాక… లవ్ ఎఫైర్స్ విషయంలో కూడా కొత్త చర్చ మొదలైంది. ఇటీవల, ధనుష్ మరియు మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందనే పుకార్లు జోరందుకున్నాయి. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో విడాకుల తర్వాత, ధనుష్‌పై ఇలాంటి గాసిప్స్ తరచుగా వినిపిస్తున్నాయి.

కొత్త అప్‌డేట్ ఏంటంటే, మృణాల్ ఠాకూర్ తన కొత్త హిందీ చిత్రం ‘దో దీవానే షహర్ మే’ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసింది. దీనిపై ధనుష్ స్పందిస్తూ, “చూడడానికి, వినడానికి కూడా బావుంది” అని కామెంట్ చేశారు.

ఇక్కడే అసలు ట్విస్ట్. ధనుష్ చేసిన కామెంట్‌కు మృణాల్ ఠాకూర్ వెంటనే హార్ట్ (❤️), సూర్యరశ్మి (🌻) ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. ‘పుకారుకు ప్రాణం పోయాలంటే..ఇలాంటి చిన్న నిప్పురవ్వ చాలు’ అన్నట్లుగా, ఈ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ అయితే మృణాల్‌ను ధనుష్ ‘గర్ల్‌ఫ్రెండ్’ అని పిలవడం, వారిద్దరినీ ‘తలైవా’, ‘తలైవి’ అని ముద్దుగా సంబోధించడం మొదలుపెట్టారు.

గతంలో కూడా, సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్‌లో వీరిద్దరూ ఆలింగనం చేసుకున్నప్పుడు ఈ డేటింగ్ వార్తలు మొదలయ్యాయి. అప్పుడు మృణాల్ ఖండించింది కానీ, ధనుష్ అక్కచెల్లెళ్లను ఫాలో అవ్వడం వంటి సంఘటనలు అనుమానాలను పెంచాయి. మృణాల్ కొత్త సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ధనుష్ పాత చిత్రం 3లోని ‘కన్నళగా’ పాటను పోలి ఉందనే మరో చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా, ధనుష్ మృణాల్ డేటింగ్ రూమర్స్ విషయంలో ఇద్దరూ నోరు మెదపకపోవడంతో, ‘మౌనం అర్ధాంగీకారం’ అనే సామెతను రుజువు చేసేలా కనిపిస్తోంది.

Leave a comment