దర్శకుడు: జీతు జోసెఫ్
నటులు: ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి
జానర్: క్రైమ్ థ్రిల్లర్
అభిరామి (అపర్ణ బాలమురళి) తన ప్రియుడి అదృశ్యానికి వెనుక ఉన్న నిజం వెతికే కథ ఇది. ఈ ప్రయాణంలో జర్నలిస్ట్ అశ్విన్ (ఆసిఫ్ అలీ) సహాయం చేస్తాడు. మొదట సింపుల్‌గా మొదలయ్యే కథ, ఒక్కో మలుపుతో కొత్త కొత్త మిస్టరీలు బయటపడుతూ, చివరికి ప్రేక్షకుడినే గందరగోళంలోకి నెడుతుంది.
అపర్ణ బాలమురళి, ఆసిఫ్ అలీ ఇద్దరూ తమ పాత్రలను తగిన న్యాయం చేశారు .వాళ్ల నటనలో సహజత్వం ఉంది.సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ వాతావరణానికి కొంత సపోర్ట్ ఇచ్చాయి. రెండో భాగంలో కొంత కధనం లో వేగం పెరగడంతో సస్పెన్స్ కాస్తా బలపడుతుంది. కానీ ఇక్కడి నుంచే ప్రేక్షకులు కొంత గందరగోళానికి గురవుతారు .
మలుపులు మరీ ఎక్కువ. మొదట ఆసక్తిగా అనిపించినా ట్విస్ట్‌లు చివరికి ఒకదాని తర్వాత ఒకటి రావడంతో విసుగొస్తుంది.
స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉంది — ఒక సీన్ నుంచి మరో సీన్‌కి మారినప్పుడు స్పష్టత లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్నిచోట్ల సీరియల్ లాగా అనిపించే స్థాయికి వెళ్తుంది.పేస్ చాలా స్లో.
క్రైమ్ థ్రిల్లర్‌కి కావలసిన టెన్షన్, స్పీడ్, సస్పెన్స్ బిల్డప్ మిస్సయ్యాయి.
ఎడిటింగ్ కూడా బలహీనంగా ఉంది; ర్యాండమ్‌గా జంప్ అయ్యే సీన్లు ఫ్లోని కత్తిరిస్తాయి.
ముఖ్యంగా, జీతు జోసెఫ్ నుంచి “దృశ్యం” లాంటి థ్రిల్లర్ ను ఆశిస్తే పూర్తిగా నిరాశే.
“Mirage” ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కావాలి కానీ అది చివరికి సస్పెన్స్ కంటే గందరగోళంగా మారింది.
మంచి నటన, కొన్ని విజువల్ మూమెంట్స్ ఉన్నా — అతి ట్విస్ట్‌లు, స్లో నరేషన్, క్లిష్టమైన కథనం సినిమా యొక్క బలం కంటే బలహీనతగా మారాయి.
ఫైనల్ గా ఒక్కసారి చూడొచ్చు.. ట్విస్ట్ లు కావలసినన్ని ఉన్నాయి కానీ పెద్ద థ్రిల్ లేదు.
OTT : Sony Liv

