ఫ్లాపుల తర్వాత నితిన్ క్రేజీ నిర్ణయం.. ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్‌తో కొత్త సినిమా షురూ!

టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ ప్రస్తుతం కెరీర్ పరంగా కాస్త గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. 2025లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘రాబిన్‌హుడ్’, ఆ తర్వాత వచ్చిన ‘తమ్ముడు’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో, నితిన్ తన తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం, నితిన్ ఇప్పుడు ఓ చిన్న సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆ దర్శకుడు మరెవరో కాదు, ఈ ఏడాది ఈటీవీ విన్ (ETV Win) వేదికగా విడుదలై, ఆ తర్వాత థియేటర్లలో కూడా సందడి చేసిన ‘లిటిల్ హార్ట్స్’  చిత్ర దర్శకుడు సాయి మార్తాండ్. మౌళి తనుజ్, శివాని నగరమ్ జంటగా నటించిన ఈ చిత్రం చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది.

ముఖ్యంగా ఓటీటీలో రికార్డు వ్యూస్ సాధించడంతో పాటు, యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సాయి మార్తాండ్ టేకింగ్, కామెడీని డీల్ చేసిన విధానం చూసి ఇంప్రెస్ అయిన నితిన్, వెంటనే అతన్ని పిలిచి కథ విన్నారట.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సాయి మార్తాండ్ చెప్పిన ఓ ఫన్-ఫిల్డ్ ఎంటర్టైనర్ లైన్ నితిన్‌కు బాగా నచ్చిందట. ప్రస్తుతం కథా చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్.

నితిన్ కెరీర్‌లో ‘భీష్మ’, ‘అ ఆ’ వంటి సినిమాలు కామెడీ ట్రాక్‌తోనే పెద్ద హిట్లయ్యాయి. ఇప్పుడు మళ్లీ తన బలం అయిన కామెడీ జానర్‌నే నమ్ముకుని, ఫ్రెష్ టాలెంట్‌తో చేతులు కలపడం మంచి నిర్ణయమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ సినిమాకు ‘ఓనవ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ నితిన్ ఫ్యాన్స్‌కి ఈ కొత్త కాంబినేషన్ ఖచ్చితంగా కిక్ ఇస్తుందని ఆశించవచ్చు. మరి ఈ ‘లిటిల్ హార్ట్’ డైరెక్టర్ నితిన్ కెరీర్‌కు ‘బిగ్ బ్రేక్’ ఇస్తాడేమో చూడాలి.

Leave a comment