మాస్ మహారాజా రవితేజ ఎనర్జీకి ఏమాత్రం లోటు లేదు. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆయనకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వర రావు’, ‘ఈగల్’ వంటి చిత్రాలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి.
కేవలం ఈ సినిమాలు మాత్రమే కాదు. ఈ మధ్య విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ మరియు అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చిన ‘మాస్ జాతర’ చిత్రాలు కూడా రవితేజ మార్కెట్‌ను బాగా దెబ్బతీశాయి. రూ. 50 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘మాస్ జాతర’ కేవలం రూ. 19 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందంటే, రవితేజ బాక్సాఫీస్ గ్రాఫ్ ఎంత దెబ్బతిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వరుస డిజాస్టర్ల తర్వాత రవితేజ తప్పనిసరిగా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సేఫ్ రూట్లోకి రవితేజ… ‘ధమాకా’ మంత్రం!
వరుస పరాజయాల నేపథ్యంలో, రవితేజ ఇప్పుడు పాత ప్రయోగాలు, కొత్త కథలను పక్కనపెట్టి, తనకు కలిసివచ్చిన పక్కా కమర్షియల్ ఫార్ములాను నమ్ముకుంటున్నారు. సోలో హీరోగా రవితేజకు చివరి సాలిడ్ హిట్ ఇచ్చింది 2022లో వచ్చిన ‘ధమాకా’ సినిమానే. ఆ హిట్ మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన సమాచారం ఇదే.
‘ధమాకా’ చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌లో “డబుల్ ధమాకా” అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించింది. ఈ పేరు చూడగానే, ఇది పక్కా రవితేజ కోసమే అని, ‘ధమాకా’కు సీక్వెల్ లేదా అదే తరహా ఎంటర్‌టైనర్ అని సినీ పరిశ్రమ ఫిక్స్ అయిపోయింది.
కీలక విషయం ఏంటంటే… ఈ ప్రాజెక్ట్‌ను కూడా ‘ధమాకా’ దర్శకుడు త్రినాథ రావు నక్కిన హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. దర్శకుడు త్రినాథ రావు నక్కిన మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. ఆయన రవితేజను మాస్ కామెడీ ట్రాక్‌లోకి మళ్ళీ తీసుకురావాలని నిర్ణయించుకున్నారట.అంతేకాకుండా, ‘ధమాకా’ విజయానికి ప్రధాన కారణమైన శ్రీలీల గ్లామర్, ఎనర్జీటిక్ డ్యాన్సులు కూడా మళ్లీ ‘డబుల్ ధమాకా’లో కనిపించనున్నాయని టాక్.
శ్రీలీల పక్కా గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. అందుకే, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పాత కాంబోను డబుల్ డోస్‌తో రంగంలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నారు.నిజానికి, రవితేజ నటించిన ‘మాస్ జాతర’లో కూడా శ్రీలీల ఉన్నప్పటికీ, రొటీన్ కథ, రవితేజ ఎంచుకున్న రోల్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
దీంతో ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ‘డబుల్ ధమాకా’ ప్రాజెక్ట్ కనుక సెట్ అయితే, హిట్ ఇచ్చిన దర్శకుడు, లక్కీ హీరోయిన్ కాంబో.. రవితేజ కెరీర్‌కు మళ్ళీ బ్రేక్ ఇస్తుందని ట్రేడ్ పండితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ‘భర్త మహశయులకు విజ్ఞప్తి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘డబుల్ ధమాకా’పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మాస్ రాజా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.

