వెంకీ మామ షూటింగ్ పార్ట్ పూర్తి: చిరంజీవి గురించి ఎమోషనల్ ట్వీట్!

టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన భారీ చిత్రం..మెగాస్టార్ చిరంజీవి, హిట్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’. పేరులోనే మెగా రేంజ్ ఎలివేషన్ ఉన్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి విక్టరీ వెంకటేష్ ఇచ్చిన అప్‌డేట్ టాలీవుడ్‌లో పెద్ద వైరల్‌గా మారింది.

ఈ చిత్రంలో వెంకటేష్ ఓ కీలక పాత్రలో, ముఖ్యంగా చిరంజీవితో కలిసి ఓ మాస్ సాంగ్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా, వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. “‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో నా పార్ట్ ఈ రోజు పూర్తి చేసుకున్నాను. ఇది నిజంగా ఒక అద్భుతమైన అనుభవం.! నా ఫేవరెట్ చిరంజీవి గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది” అని వెంకటేష్ పేర్కొన్నారు.

అంతేకాదు, “మెగాస్టార్ చిరంజీవి గారితో స్క్రీన్ పంచుకోవడం ఎప్పుడో జరగాల్సింది. ఆ కల నెరవేర్చినందుకు అనిల్ రావిపూడికి చాలా సంతోషంగా ఉంది” అని వెంకటేష్ రాసుకొచ్చారు.

ఈ ఇద్దరు స్టార్ హీరోలు, అగ్ర నటులు నిజజీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటిది, వీరి కాంబినేషన్ వెండితెరపైకి రావడానికి ఇన్నేళ్లు పట్టింది. మొత్తానికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి ఈ మెగా-విక్టరీ కలయికను సాకారం చేశారు.

వెంకటేష్, చిరంజీవి కలిసి నటించిన సాంగ్ షూట్ ఇటీవల హైదరాబాద్‌లోని ఓ పబ్‌ సెట్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పాట ఫ్యాన్స్‌కి కనుల పండుగగా ఉంటుందని తెలుస్తోంది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్‌కి అదిరిపోయే బీట్స్ అందించారని, కొరియోగ్రాఫర్ విజయ్ పోలాంకి మాస్టర్ డ్యాన్స్ నెంబర్‌ను అదిరిపోయేలా డిజైన్ చేశారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సుమారు 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించడం విశేషం. తెరపై వీరిద్దరి ఎనర్జీ చూసేందుకు అభిమానులు ఇప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు.

2026 సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్

ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. చిరంజీవి ఫుల్ ఎనర్జీతో కనిపించే ఈ చిత్రం 2026 సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌లో కూడా బిజీగా ఉన్నారు. అయితే, ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

టైటిల్, కాస్ట్, రిలీజ్ డేట్.. అన్నీ పక్కా ప్లాన్‌తో సెట్ చేసిన అనిల్ రావిపూడి.. సంక్రాంతి పండుగకు నిజమైన ‘మెగా-విక్టరీ’ ఫెస్టివల్‌ను ప్లాన్ చేశారనే చెప్పాలి. థియేటర్లలో వీరిద్దరి కాంబోలో వచ్చే ఆ ఫైర్‌ని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు

Leave a comment