చిన్న సినిమాల పాలిట పెద్ద దిక్కుగా విజయ్ దేవరకొండ.. ఆ హిట్ సినిమా కోసం రంగంలోకి!

ఒకప్పుడు ఆటిట్యూడ్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విజయ్ దేవరకొండ, ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ గా అడుగులు వేస్తున్నాడు. “ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి” అనే సామెతను విజయ్ ఇప్పుడు గట్టిగా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. స్టార్ డమ్ తలకెక్కించుకోకుండా, గతంలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటూ హుందాగా వ్యవహరిస్తున్నాడు. కేవలం తన సినిమాలే కాకుండా, ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు, చిన్న హీరోలకు అండగా నిలవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

మొన్నటికి మొన్న ‘లిటిల్ హార్ట్స్’ , ఆ తర్వాత తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాల సక్సెస్ మీట్లకు గెస్ట్ గా వచ్చి ఆయా చిత్ర యూనిట్లలో జోష్ నింపాడు. ఇప్పుడు మరో చిన్న సినిమాకు తన వంతు సపోర్ట్ ఇవ్వడానికి విజయ్ రెడీ అయిపోయాడు.

ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. కంటెంట్ బాగుంటే చిన్న సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న గ్రాండ్ సక్సెస్ మీట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా రానున్నారు. నిర్మాతలు అడగ్గానే మరో మాట లేకుండా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

నిజానికి విజయ్ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, స్వయంకృషితో స్టార్ గా ఎదిగినవాడే. అందుకే కొత్తవాళ్ల కష్టం, చిన్న సినిమాల స్ట్రగుల్స్ అతనికి బాగా తెలుసు. అందుకే స్టార్ డమ్ ని పక్కన పెట్టి, తనలాంటి వర్ధమాన నటులకు, చిన్న చిత్రాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇండస్ట్రీ వర్గాల నుంచి, నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. పెద్ద హీరోలు ఇలా చిన్న సినిమాలను ప్రోత్సహిస్తే టాలీవుడ్ మరింత కళకళలాడటం ఖాయం.

Leave a comment