విశాల్ తొలిసారిగా మెగాఫోన్ పట్టిన చిత్రం ‘మకుటం’. ఈ సినిమా విశాల్‌కు 35వ ప్రాజెక్ట్ కాగా, ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి (సూపర్ గుడ్ ఫిల్మ్స్)కు 99వ ప్రొడక్షన్ కావడం విశేషం. దర్శకుడు రవి అరసు అందించిన పవర్ ఫుల్ కథతో ఈ సినిమా రూపొందుతోంది.
గతంలో రవి అరసు డైరెక్టర్ స్థానం నుంచి తప్పుకోవడంతో, విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ‘నిర్మాత డబ్బును, సినిమా స్థాయిని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని విశాల్ ఆ సమయంలో ప్రకటించారు.
ఇక తాజాగా సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన, యాక్షన్ ప్రధానమైన క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తయింది. 17 రోజులు ఆగకుండా, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షూటింగ్ జరిగింది.
ఈ షెడ్యూల్లో దాదాపు 800 మంది టెక్నీషియన్లు, వందలాది స్టంట్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఇదొక యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. అంటే… “పట్టుదలతో పని చేస్తే ఏదైనా సాధ్యమే” అన్నట్లుగా, యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో ఈ సీక్వెన్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో చిత్రీకరించారు.
విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య వంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫీ ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణ. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి 2026లో ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాను విడుదల చేయనున్నారు.

