రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి ఫిబ్రవరి 26, 2026 న!

టాలీవుడ్ లవ్ బర్డ్స్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహంపై తాజాగా ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. గత అక్టోబర్ 2025లో వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను అనుసరించి, ఇప్పుడు వీరి వివాహ తేదీ కూడా లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

విజయ్ దేవరకొండ , రష్మిక మందన చాలా సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో వారి నిశ్చితార్థం జరిగిందని, విజయ్ టీమ్ కూడా ఆ వార్తలను ధృవీకరించింది.దీని తరువాత, ఇప్పుడు వీరి వివాహ తేదీ ఫిబ్రవరి 26, 2026 గా ఖరారైందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ జంట రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఒక అందమైన ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ తేదీని గానీ, డెస్టినేషన్ వెడ్డింగ్‌ను గానీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన లో ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు లేదా ధృవీకరించలేదు.

మరోవైపు, రష్మిక ఇటీవల తన సినిమా ప్రమోషన్స్ సందర్భంగా నిశ్చితార్థం వార్తలపై స్పందించారు. “అందరికీ దాని గురించి తెలుసు కదా” అని ఆమె కేవలం నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇది అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

Leave a comment