శర్వానంద్ ‘బైకర్’ గ్లింప్స్ విడుదల

 

యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లో మరో వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా, ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘బైకర్’ నుంచి ‘ఫస్ట్ ల్యాప్ – ది గ్లింప్స్’ ను చిత్ర బృందం విడుదల చేసింది. కేవలం 1 నిమిషం 22 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఈ గ్లింప్స్ సినిమా కథ  బైక్ రేసింగ్ చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది. రేసింగ్ ట్రాక్‌పై హీరో శర్వానంద్ స్టైలిష్ బైకర్‌గా కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.శర్వానంద్ కొత్త లుక్, ఆయన డెడికేషన్ ఈ గ్లింప్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది గ్లింప్స్‌లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్నీ హై-క్వాలిటీతో, ఉన్నత  స్థాయి నిర్మాణ విలువలతో ఉన్నాయని తెలుస్తోంది . 

దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రాన్ని సరికొత్త రీతిలో తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్‌తో పాటు సీనియర్ హీరో   డా. రాజశేఖర్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు, అలాగే కథానాయికగా మాళవికా నాయర్ నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో,  ‘బైకర్’ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది అనడంలో సందేహం లేదు. ఈ బైక్ రేసింగ్ డ్రామా పూర్తి వివరాలు, విడుదల తేదీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. 

 

Leave a comment