విజయ్ దేవరకొండతో తలపడనున్న ‘మమ్మీ’ విలన్ – VD14 సెట్స్ నుంచి లీకైన పిక్!

విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది మామూలు కిక్ ఇచ్చే న్యూస్ కాదు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రౌడీ స్టార్ సిద్ధమవుతున్నారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా (VD14) కోసం ఏకంగా హాలీవుడ్ ప్రతినాయకుడిని రంగంలోకి దించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను భయపెట్టిన ‘ది మమ్మీ’  సినిమా విలన్ ఆర్నాల్డ్ వోస్లూ , ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ, షూటింగ్ లొకేషన్ లో నటుడు వినోద్ సాగర్ తో ఆర్నాల్డ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది.

బ్రిటిష్ ఆఫీసర్ గా ఆర్నాల్డ్:

ఈ సినిమా కథ 1854–1878 మధ్య కాలంలో సాగుతుందని సమాచారం. ఇందులో ఆర్నాల్డ్ ఒక క్రూరమైన బ్రిటిష్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. రాయలసీమ ప్రాంతంలో జరిగే పోరాటంలో బ్రిటిష్ పాలకులకు, మన కథానాయకుడికి మధ్య జరిగే వార్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయట.

లైగర్ భయం వద్దు.. ఈసారి గట్టిదే:

గతంలో ‘లైగర్’ కోసం బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ను తీసుకువచ్చినప్పుడు భారీ హైప్ వచ్చింది కానీ, ఆ పాత్ర తేలిపోయింది. కానీ ఆర్నాల్డ్ వోస్లూ అద్భుతమైన నటుడు కాబట్టి, రాహుల్ సాంకృత్యన్ ఆయన పాత్రను బలంగా తీర్చిదిద్ది ఉంటారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి కేవలం గెస్ట్ అప్పీయరెన్స్ కాకుండా, కథలో కీలకమైన పాత్ర కావడం విశేషం.

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక హీరోయిన్ గా రష్మిక మందన్నా పేరు వినిపిస్తున్నా, అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. మొత్తానికి విజయ్ ఈసారి పక్కా ప్లానింగ్ తో పాన్-వరల్డ్ రేంజ్ లో కొట్టేలా ఉన్నాడు.

Leave a comment