ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద సౌండ్ చేస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంభాయ్’. తెలంగాణ పల్లెటూరి నేపథ్యం, పక్కా నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమాకు ‘రూరల్ కల్ట్ బ్లాక్‌బస్టర్’ అనే టాక్ వచ్చింది. సాయిలు కంపటి దర్శకత్వంలో, వేణు ఉడుగుల నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, సినిమాను జనంలోకి మరింతగా తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ఒక సంచలనం నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. మహిళలకు ఫ్రీ షోలు!
అవును, మీరు విన్నది నిజమే. “మా రాంభాయ్ కథ.. ప్రతి మహిళ కోసం!!” అనే నినాదంతో ఆంధ్రా మరియు సీడెడ్ (రాయలసీమ) జిల్లాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో మహిళలకు ఉచిత ప్రదర్శనలు వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సాధారణంగా ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్లు చూస్తుంటాం కానీ, ఇలా పూర్తిగా ఉచితం అనడం కాస్త ఆశ్చర్యమే. బహుశా మౌత్ టాక్ (Word of mouth) పెంచడానికి ఇది బెస్ట్ స్కెచ్ అని చెప్పుకోవచ్చు.
ఫ్రీ షోలు ఎక్కడెక్కడంటే? ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. లిస్ట్ ఇదే:
-
విశాఖపట్నం: శ్రీకన్య, జగదాంబ
-
విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్
-
గుంటూరు: బాలీవుడ్
-
తిరుపతి: జయ శ్యామ్
-
కర్నూలు: ఆనంద్
-
నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్
-
కడప: రవి
-
రాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్
-
కాకినాడ: పద్మ ప్రియ
-
ఏలూరు: అంబికా
-
ఒంగోలు: గోపి
-
శ్రీకాకుళం: సూర్య మహల్
-
విజయనగరం: కృష్ణ
-
అనంతపురం: SV సినీ మాక్స్
-
నంద్యాల: నిధి
-
తణుకు: శ్రీ వెంకటేశ్వర
-
మచిలీపట్నం: సిరి కృష్ణ
-
చిత్తూరు & హిందూపురం: గురునాథ్
-
రాయచోటి: సాయి
-
కావలి: లత, మానస (రెండు షోలు)
మహిళా ప్రేక్షకులు నేరుగా ఈ థియేటర్లకు వెళ్లి ఉచితంగా టికెట్ తీసుకొని సినిమా చూడొచ్చు. కంటెంట్ ఉన్న సినిమా అంటున్నారు కాబట్టి, ఫ్రీ ఆఫర్ తోడైతే థియేటర్లు హౌస్ ఫుల్ అవ్వడం ఖాయం. మరి ఈ “ఫ్రీ” స్ట్రాటజీ ‘రాజు వెడ్స్ రాంభాయ్’ కలెక్షన్లకు ఎంత మైలేజ్ ఇస్తుందో చూడాలి!

