“వానర” టీజర్: వైల్డ్ రైడ్ మొదలైంది! మాస్ కా దాస్ గొంతు అదుర్స్.

టాలీవుడ్‌లో కొత్త కథలు, కొత్త నటీనటులతో ప్రయోగాలు పెరుగుతున్నాయి. ఈ కోవలోనే ఎంట్రీ ఇస్తున్న చిత్రమే “వానర”. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్.. చూసిన ప్రేక్షకులకు ఒక ‘వైల్డ్ రైడ్’ అనుభూతిని అందించింది. సేఫ్ గేమ్‌లు ఆడకుండా, అవుట్ అండ్ అవుట్ క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు ఈ టీమ్ సిద్ధమైందని టీజర్ స్పష్టం చేసింది.

అవినాష్ డబుల్ రోల్, విష్వక్ సేన్ వాయిస్ పవర్..!

ఈ సినిమాకు హీరోగా, దర్శకుడిగా అవినాశ్ తిరువీధుల పరిచయమవుతున్నారు. ఇండస్ట్రీకి కొత్త అయినా, అవినాష్ కాన్ఫిడెన్స్ అద్భుతంగా ఉంది. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి గ్లామర్, కెమిస్ట్రీ బాగున్నాయి.

అయితే, టీజర్ రిలీజ్ ఈవెంట్‌కు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా రావడం, టీజర్‌కు మాస్ కా దాస్ విష్వక్ సేన్ తన పవర్‌ఫుల్ వాయిస్‌ఓవర్ ఇవ్వడం సినిమాకు మంచి బజ్‌ను తీసుకొచ్చింది. విష్వక్ సేన్ వాయిస్‌ఓవర్.. వానర పాత్ర యొక్క ఇంటెన్సిటీని పెంచింది.

మైథలాజికల్ టచ్ , ఊర మాస్ కామెడీ..!

“వానర” స్టోరీ లైన్ ఒక విభిన్నమైన సోషియో-ఫాంటసీని టచ్ చేసింది. రావణుడితో యుద్ధానికి ఒక వానర సేనాపతి భూమికి వస్తే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో కథ అల్లినట్టు తెలుస్తోంది.

టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు, గమ్మత్తైన విజువల్స్, ముఖ్యంగా ఒక బైక్‌ను లాక్కెళ్లే సీన్ చుట్టూ అల్లిన కామెడీ, యాక్షన్ మామూలుగా లేవు. ఈ సినిమా లాజిక్‌ను పక్కన పెట్టి, ఫుల్ ఫన్ అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

నందు విలన్‌గా పవర్ చూపించగా, ఖడ్గం పృధ్వీ, కోన వెంకట్, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర వంటి సీనియర్ కమెడియన్లు ఉండటం వల్ల కామెడీ డోస్ పీక్స్ లో ఉంటుందని అర్థమవుతుంది. దర్శకుడిగా అవినాష్ ప్రతి ఫ్రేమ్‌ను స్టైలైజ్ చేసి, కలర్‌ఫుల్‌గా చూపించారు.

టెక్నికల్ బ్రిలియన్స్

ఈ సినిమాకు వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఎనర్జిటిక్‌గా, కొంచెం చావోస్ (Chaos) గా ఉంది. ఈ క్రేజీ వైబ్‌కు ఆయన మ్యూజిక్ పర్ఫెక్ట్ లిఫ్ట్ ఇచ్చింది. ఇక, మాటల మాంత్రికుడు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ క్వాలిటీగా ఉన్నాయి.

సిల్వర్ స్క్రీన్ సినిమాస్ LLP బ్యానర్‌పై శంతను పత్తి, అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, అంకిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మొత్తానికి, “వానర” టీజర్.. ప్యూర్, అన్‌ఫిల్టర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు థియేటర్లో ఒక మంచి పండుగలా ఉంటుందని హింట్ ఇచ్చింది. ఈ ‘క్రేజీ’ సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూడవచ్చు.

Leave a comment