గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తర్వాత ఫుల్ ఫోకస్ అంతా తన తదుపరి చిత్రం “పెద్ది” మీదే పెట్టారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టబోతున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమా స్టోరీ గురించి ఒక షాకింగ్ న్యూస్ మనకు తెలియ వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ పాత్రలో ఒక భారీ ట్విస్ట్ ఉండబోతోందట. సినిమా సెకండ్ హాఫ్ లేదా క్లైమాక్స్ సమయంలో జరిగే ఒక కీలక సంఘటనలో హీరో కాలు విరిగిపోతుందని, ఆ తర్వాత చరణ్ కుంటివాడిగా కనపడబోతున్నాడు అంట .
ఒక స్పోర్ట్స్ ప్లేయర్ కాలు కోల్పోతే పడే మానసిక వేదన, ఆ తర్వాత వచ్చే ఎమోషనల్ జర్నీ ఈ సినిమాకి హైలైట్ కానుందట. ఈ సాహసోపేతమైన నిర్ణయం నిజమైతే, చరణ్ నటనకు మరోసారి అవార్డులు ఖాయం.
గతంలో ‘రంగస్థలం’ సినిమాలో వినికిడి లోపం ఉన్న ‘చిట్టిబాబు’ పాత్రలో చరణ్ జీవించేసి, నేషనల్ లెవల్లో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మరోసారి శారీరక వైకల్యం ఉన్న పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ‘కుంటివాడి’ ట్విస్ట్ గనుక నిజమైతే, థియేటర్లలో ఎమోషనల్ సునామీ గ్యారెంటీ!

