బాలయ్య ‘అఖండ 2’కి సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్? పవర్ఫుల్ ఈవెంట్ ప్లాన్!

‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద భూకంపమే. వీరి బ్లాక్‌బస్టర్ సినిమా ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ సీక్వెల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు రిలీజ్ అయ్యి ఫ్యాన్స్‌లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా, సినిమా రిలీజ్‌కు ముందు హైప్‌ను పీక్స్‌కి తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యమైనది ప్రీ-రిలీజ్ ఈవెంట్. ఈ నెల 28న ఈ వేడుకను హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే, ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం ఏమిటంటే… ఈ మెగా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకాబోతున్నారట! ఈ విషయం దాదాపు ఖరారైనట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సినిమా పబ్లిసిటీ సంగతి పక్కన పెడితే, రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, సినిమా వేదికపై బాలకృష్ణ ఆహ్వానాన్ని సీఎం స్వీకరించడం నిజంగా అరుదైన దృశ్యం. సినీ ఇండస్ట్రీపై రేవంత్ రెడ్డికి ఉన్న గౌరవం, అలాగే బాలయ్య చరిష్మాకు ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

ఇక ఈ ఈవెంట్‌కు మరో స్టార్ గెస్ట్‌ను తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఆయనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే, ఒకే వేదికపై బాలయ్య, బన్నీ, సీఎం రేవంత్ రెడ్డిని చూడటం ఫ్యాన్స్‌కు పండుగే అవుతుంది! కానీ, అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటం వల్ల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రావడం కష్టం అని తెలుస్తోంది. అయితే, సినిమా రిలీజ్ అయి, భారీ విజయం సాధిస్తే.. సక్సెస్ మీట్‌కు బన్నీ వచ్చే అవకాశం ఉందని సినీ పండితులు అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా టీం ప్రమోషన్స్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి ఆయనతో సినిమాలోని కొన్ని రషెస్‌ను పంచుకోవడం జరిగింది. ఇది ‘అఖండ 2’ పాన్-ఇండియా రేంజ్‌ను సూచిస్తుంది. డిసెంబర్ 5న ఈ ‘తాండవం’ థియేటర్లలో ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఏదేమైనా, సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్‌గా వస్తున్నారనే వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment