రివ్యూ : ఆంధ్రా కింగ్ తాలూకా

నటీనటులు: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్ తదితరులు                                         దర్శకత్వం: మహేష్ బాబు పి  సంగీతం: వివేక్ – మెర్విన్ నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్ 

వరుస పరాజయాల తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (RAPO) ఒక వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యాన్స్ ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం రామ్ ఆశించిన హిట్ ఇచ్చిందా? రివ్యూలో చూద్దాం.

కథనం-విశ్లేషణ:

మామూలుగా స్టార్ హీరోల సినిమాల్లో ఫ్యాన్స్ కోసం ఎలివేషన్లు ఉంటాయి. కానీ ఇదొక ఫ్యాన్ కథే సినిమాగా మారింది. దర్శకుడు మహేష్ బాబు.పి ఎంచుకున్న పాయింట్ చాలా నిజాయితీగా ఉంది. సముద్రం, సూర్యుడు ఎప్పటికీ కలవరు.. కానీ చూడ్డానికి ఎంత బాగుంటారో.. హీరో-అభిమాని బంధం కూడా అంతే అని చెప్పిన డైలాగ్ సినిమా ఆత్మను పట్టి ఇస్తుంది.

సినిమా మొదలైనప్పటి నుంచే కథ తన కోర్ పాయింట్‌కి కట్టుబడి సాగుతుంది. తన అభిమాన హీరో సూర్య కుమార్  (ఉపేంద్ర) కోసం ఏమైనా చేసే ఒక వీరాభిమాని సాగర్ (రామ్) కథే ఇది. దర్శకుడు మహేష్ ఈ పాయింట్‌ను ఎక్కడా డీవియేట్ అవ్వకుండా, మంచి సంగీతం మరియు బలమైన డైలాగ్స్‌తో ఆసక్తికరంగా మలిచారు.రామ్ హీరోకి అభిమానిగా మారే క్రమం కూడా బాగుంటుంది.రామ్ కి భాగ్యశ్రీ మధ్య జరిగే లవ్ ట్రాక్ కూడా పర్లేదు. చాన్నాళ్లకు రామ్ ను సరి కొత్త ఎనర్జీ లో చూస్తాం.డ్యాన్స్ లలో కూడా వింటేజ్ రామ్ ను చూస్తాం. భాగ్యశ్రీ నటన కూడా నచ్చుతుంది.

ఉపేంద్ర హీరో క్యారక్టర్ లో తన ఉనికిని చాటుకున్నారు.పతాక సన్నివేశాల్లో కీలకమైన ఎమోషన్ సీన్లలో తన అనుభవాన్ని చూపిస్తారు.వివేక్ – మెర్విన్ ద్వయం సమకూర్చిన సంగీతం బాగుంది. మెలోడీ సాంగ్ , ఫస్టాఫ్ లో వచ్చే మాస్ సాంగ్ నచ్చుతాయి. ముఖ్యంగా లాస్ట్ 40 మినిట్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలకు అందించిన బాగ్రౌండ్ స్కోర్ హత్తుకుంటుంది. 

విలేజ్ బాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు,టెంపుల్ సీను మరియు థియేటర్ ఫైట్ మంచి హై ఇస్తాయి..హీరో తన తండ్రి రావు రమేష్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయి.అవే సినిమాకు గట్టి బలంగా తయారు అయ్యాయి.

రావు రమేష్ చెప్పిన రామాయణం గురించిన డైలాగ్స్ మరియు ఆ సందర్భంలో వచ్చే పాట సినిమా స్థాయిని పెంచేశాయి. క్లైమాక్స్ గుండెకు హత్తుకునేలా ఉండటమే కాకుండా, సినిమాను ఒక పాజిటివ్ నోట్‌తో ముగిస్తుంది.

ఏ హీరో అభిమాని అయినా సరే, ఈ సినిమాలోని కొన్ని ఆలోచింపజేసే సంభాషణలకు కనెక్ట్ అవ్వకుండా ఉండలేరు. గొప్ప విషయం ఏంటంటే.. ఈ డైలాగులు ఎక్కడా ఉపన్యాసాల్లా  అనిపించవు.ద్వితీయార్థంలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి.

“హీరోని దేవుడిలా చూసే ప్రతి అభిమాని” ఈ సినిమాలో ఏదో ఒక పాయింట్‌కి కచ్చితంగా కనెక్ట్ అవుతారు.

ప్లస్ పాయింట్స్:

  • రామ్ పోతినేని నటన 

  • దర్శకుడు మహేష్ రాసిన బలమైన డైలాగులు.

  • సెకండాఫ్ మరియు గుండెను తాకే క్లైమాక్స్.

  • వివేక్-మెర్విన్ అందించిన పాటలు.

మైనస్ పాయింట్స్:

ఫస్టాఫ్‌లో మొదటి అరగంట కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది.ఫ్యాన్ స్టఫ్ కోసం చూసే వారికి ప్రారంభం కాస్త సాగదీసినట్టు అనిపించవచ్చు.ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కత్తెరకు ఇంకాస్త పనిచెప్పి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉండేది. అలాగే కథనం అక్కడక్కడా ఊహకందేలా సాగడం కొంత నిరాశ కలిగిస్తుంది.

చివరగా..!

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఒక నిజాయితీ గల ప్రయత్నం. కేవలం వినోదం కోసమే కాకుండా, ఒక మంచి ఎమోషనల్ డ్రైవ్‌తో సాగే చిత్రం ఇది. రామ్ పోతినేని మరియు భాగ్యశ్రీ  నుంచి ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఈ సినిమా . చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా ఇది ఒక ‘హార్ట్ వార్మింగ్’ ఎక్స్‌పీరియన్స్.

Sky C Rating : 2.75/5

Leave a comment