‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న జాతిరత్నం నవీన్ పొలిశెట్టి, ఇప్పుడు సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ ‘భీమవరం బాల్మ’ నిన్న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.
విశేషం ఏంటంటే, ఈ పాటతో నవీన్ పొలిశెట్టి సింగర్‌గా అవతారమెత్తాడు. ఇప్పటివరకు తన కామెడీ టైమింగ్‌తో, రైటింగ్‌తో మెప్పించిన నవీన్.. మైక్ పట్టుకొని మాస్ బీట్‌కి గొంతు కలపడం ఫ్యాన్స్‌కి పెద్ద సర్ప్రైజ్. మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్స్ ఇస్తాడని పేరుంది, కానీ ఈసారి రూటు మార్చి ఊర మాస్ బీట్ కొట్టాడు. చంద్రబోస్ రాసిన లిరిక్స్ క్యాచీగా ఉండగా, నవీన్‌తో పాటు నూతన మోహన్ ఈ పాటను ఆలపించారు.
ఇక వీడియోలో నవీన్ ఎనర్జీ, మీనాక్షి చౌదరి గ్లామర్ షో ఆడియెన్స్‌ని కట్టిపడేస్తున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఇద్దరూ పోటీపడి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో రీల్స్‌కి పక్కా మెటీరియల్ అనిపిస్తోంది. “నీకు నాకు లింక్ కుదిరె..” అంటూ సాగే ఈ పాట యూత్ ఆడియెన్స్‌కి ఇట్టే ఎక్కేలా ఉంది.
గతంలో ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా అనుకున్నా, తాజా అప్డేట్ ప్రకారం ‘మారి’ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మధ్యలో నవీన్ ఆక్సిడెంట్ వల్ల షూటింగ్ ఆలస్యమైనా, లేట్ అయినా లేటెస్ట్‌గా వస్తానంటూ వచ్చే ఏడాది సంక్రాంతికి కర్చీఫ్ వేశారు. ప్రభాస్ ‘రాజా సాబ్’, మెగాస్టార్ సినిమాలతో పోటీ ఉన్నా.. రాజు గారి కాన్ఫిడెన్స్ చూస్తుంటే సంక్రాంతికి గట్టిగానే నవ్వించేలా ఉన్నారు!

