ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు సినిమాలతోనూ దుమ్మురేపుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, గ్యాప్ దొరికినప్పుడల్లా పెండింగ్ షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు.
ఇటీవలే బాక్సాఫీస్ దగ్గర ‘OG’ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టారు పవన్. ఈ జోష్ ఇంకా తగ్గకముందే, ఇండస్ట్రీ వర్గాల నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పవన్ కళ్యాణ్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్టేనని తాజా సమాచారం. ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాలతో యాక్షన్ సినిమాల రూపురేఖలు మార్చిన లోకేష్.. పవన్‌కు ఒక పవర్ ఫుల్ స్టోరీ లైన్ వినిపించారని, దానికి పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.
వాస్తవానికి ఎన్నికలకు ముందే ఈ కాంబినేషన్‌పై చర్చలు జరిగినా, పవన్ రాజకీయ షెడ్యూల్ వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ KVN Productions నిర్మించబోతోందని సమాచారం. ఇది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందట. లోకేష్ మార్క్ టేకింగ్‌కి, పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ తోడైతే థియేటర్లలో రికార్డులు బద్దలవ్వడం ఖాయం. అయితే, ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమా లేక స్టాండలోన్ సినిమానా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ లైన్‌లో ఉంది. వీటన్నింటి మధ్యలో లోకేష్ సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

