సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం కలిగించిన ఇమ్మడి రవి కథ ఇప్పుడు అదే ఇండస్ట్రీలో సినిమాగా మారబోతోంది. తాజా సమాచారం ప్రకారం, ‘తేజ్ క్రియేటివ్ వర్క్స్’ అనే బ్యానర్ పై ఈ బయోపిక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రముఖ యూట్యూబర్ మరియు నటుడు దొరసాయి తేజ ప్రధాన పాత్ర పోషించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఒకప్పుడు పోలీసులకు సవాలు విసిరి, విదేశాల్లో దాక్కున్న రవిని సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఒక సాధారణ వ్యక్తి టెక్నాలజీని వాడి ఇండస్ట్రీని ఎలా భయపెట్టాడు, అతని కుటుంబ నేపథ్యం, ఐ బొమ్మ సైట్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్, మరియు చివరకు జరిగిన అరెస్ట్.. ఇవన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నారట.
అయితే, ఈ వార్తపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “మాకు ఫ్రీగా సినిమాలు చూపించిన రవిని చూడటానికి మేము టికెట్ కొని థియేటర్ కి వెళ్ళాలా?” అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, ఇండస్ట్రీని దెబ్బతీసిన వ్యక్తిని హీరోగా చూపించడం సరైనదేనా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా, ఒక ‘విలన్’ లైఫ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


ఆంధ్రప్రదేశ్లో కులాల కంపు.. రాజకీయాల నుంచి సినిమా వరకు..!
on December 2, 20250