SSMB29 ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్ లైవ్: మహేష్ బాబు టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కోసం ప్రపంచమంతా ఎదురుచూపు!

యావత్ ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న SSMB29 అప్డేట్ రానే వచ్చింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్ ట్రోటర్’ పేరుతో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు 50,000 మందికి పైగా అభిమానులు హాజరవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ‘పాస్‌పోర్ట్’ తరహాలో ఎంట్రీ పాసులను రూపొందించడం విశేషం.

ఈ వేదికపై శ్రుతి హాసన్ మరియు ర్యాపర్ డివైన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత, సినిమా అధికారిక టైటిల్‌ను ప్రకటించి, కెన్యాలోని మసాయి మారాలో చిత్రీకరించిన మూడు నిమిషాల నిడివి గల ఫస్ట్ గ్లింప్స్ టీజర్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ టీజర్‌ను 130 అడుగుల భారీ స్క్రీన్‌పై ప్రదర్శించనున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్‌కు యాంకర్ సుమ మరియు ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచ్లానీ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు.

భారత్‌లో జియోహాట్‌స్టార్‌లో ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. అదే సమయంలో, దుబాయ్‌లోని స్టార్ సినిమాస్ వంటి అంతర్జాతీయ వేదికలపై కూడా అభిమానుల కోసం ప్రత్యేక స్క్రీనింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ గ్లోబల్ ఈవెంట్‌కు పలువురు భారతీయ సినీ ప్రముఖులతో పాటు కొంతమంది హాలీవుడ్ ప్రతినిధులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.

Leave a comment