‘ప్రేమంటే’ ట్రైలర్: ఫన్ పోయి థ్రిల్ వచ్చింది! ప్రియదర్శి కొత్త పెళ్లి కష్టాలు.

ప్రియదర్శి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ నవ్వులు ఉంటాయి, కానీ ఈ మధ్య ‘కోర్ట్’ లాంటి సినిమాలతో తనలోని నటుడిని కూడా బాగా బయటపెట్టాడు. అయితే ఆ స్థాయి హిట్ మళ్ళీ పడలేదు. అందుకే కావచ్చు, తనకు బాగా అచ్చొచ్చిన ఫన్ జోనర్‌లోకి మళ్లీ వచ్చాడు. ‘ప్రేమంటే’ ట్రైలర్ చూస్తుంటే, ఇది కేవలం నవ్వులే కాదు, అంతకు మించి అంటున్నాడు దర్శి.

ట్రైలర్ భార్యాభర్తల (ప్రియదర్శి, ఆనంది) మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్లతో మొదలైంది. అంతా హ్యాపీగా సాగిపోతున్న పెళ్లి జీవితంలోకి అనుకోని ‘థ్రిల్’ ఎంటర్ అయినట్టుంది. “థ్రిల్‌ ప్రాప్తిరస్తు” అనే ట్యాగ్‌లైన్‌ను జస్టిఫై చేస్తూ, లవ్, కామెడీ కాస్తా థ్రిల్లర్ మూడ్లోకి టర్న్ తీసుకుంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టు, పాపం ప్రియదర్శి మళ్ళీ కష్టాల్లో పడ్డాడు.

ఈ కష్టాల మధ్యలో యాంకర్ సుమ కానిస్టేబుల్ పాత్రలో కనిపించడం, అలాగే వెన్నెల కిషోర్ ఉండటం కామెడీ టైమింగ్‌కు ఢోకా లేదనిపిస్తుంది. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ అయినా, ట్రైలర్ కట్ చేసిన విధానం ఆకట్టుకుంది.

మొత్తానికి, ‘ప్రేమంటే’ ట్రైలర్ ఒక రొటీన్ రొమాంటిక్ కామెడీలా మొదలై, ఊహించని మలుపు తీసుకునే స్పైన్-చిల్లింగ్ థ్రిల్లర్‌గా ముగిసింది. ప్రియదర్శికి ఈసారైనా ఈ ఫన్ అండ్ థ్రిల్ ప్రయోగం హిట్టు ఇస్తుందో లేదో చూడాలి. సినిమా ఈ నెల 21న థియేటర్లలోకి రానుంది.

Leave a comment