జూబ్లీహిల్స్ లో BRS గెలిస్తే రేవంత్ రెడ్డికి గండమే.!?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి, అధికార కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారనుంది. జూబ్లీహిల్స్ లో BRS గెలిస్తే రేవంత్ రెడ్డికి ప్రమాద ఘంటికలు మోగినట్టే.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ పరిధిలో జరిగిన ఉపఎన్నికలో ఓటమి ఎదురైతే, అది పట్టణ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం లేదని స్పష్టం చేస్తుంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని మెజారిటీ సీట్లను కాంగ్రెస్ కోల్పోయింది. ఈ కీలకమైన ఉపఎన్నికలో కూడా ఓటమి ఎదురైతే, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు పెరిగే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి ‘ఆరు గ్యారంటీ’ పథకాలు కూడా నగర ప్రజలపై ఆశించినంత ప్రభావం చూపలేదనే చర్చకు తావిస్తుంది.

కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్‌ఎస్ సెంటిమెంట్

ఈ ఉపఎన్నికలో ఓటమి భయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ చివరి నిమిషంలో వ్యూహాత్మక అడుగులు వేసింది. మైనారిటీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు మహమ్మద్ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం జరిగింది. అయితే, ఈ ఎన్నికల్లో సెంటిమెంట్‌ను పక్కన పెట్టి, అభివృద్ధికి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

మరోవైపు, బీఆర్‌ఎస్ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టి, సెంటిమెంట్, పాత ఎమ్మెల్యే సేవలను ప్రచారాస్త్రంగా వాడుతోంది.మొత్తంగా ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది నవంబర్ 14న తేలనుంది.

Leave a comment