మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం తన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. నవంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో కీర్తికి ఓ ఆసక్తికరమైన, కాస్త ఇబ్బందికరమైన ప్రశ్న ఎదురైంది. గతంలో ఒక సందర్భంలో “చిరంజీవి కంటే విజయ్ బెటర్ డ్యాన్సర్” అని కీర్తి అన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై క్లారిటీ ఇవ్వాలని విలేకరులు కోరగా, కీర్తి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
అసలు విషయం ఏంటంటే.. తాను ఎప్పుడూ ఇద్దరినీ పోల్చి తక్కువ చేయలేదని కీర్తి స్పష్టం చేశారు. “చిరంజీవి గారు లెజెండ్. ఆయనంటే నాకు, మా అమ్మగారికి ఎంతో గౌరవం. ‘భోళా శంకర్’ సెట్స్‌లో నేను చిరంజీవి గారితో మాట్లాడుతూ.. ‘సర్, నేను విజయ్ గారికి పెద్ద ఫ్యాన్’ అని చెప్పాను. దానికి ఆయన చాలా స్పోర్టివ్‌గా నవ్వేసి, ‘అవునా, మంచిది’ అని సరదాగా తీసుకున్నారు తప్ప, సీరియస్ అవ్వలేదు” అని కీర్తి తెలిపారు.
ఆయన డ్యాన్స్ గురించి కామెంట్ చేసే స్థాయి తనకు లేదని, తాను కేవలం ఒక విజయ్ అభిమానిగా ఆ మాట అన్నానని వివరించారు. మెగాస్టార్ గొప్పతనం గురించి చెబుతూ, ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ చూసి బాధపడనని, కానీ తన మాటలను వక్రీకరిస్తే మాత్రం కష్టంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తానికి, మెగాస్టార్ స్పోర్టివ్ నేచర్ మరోసారి బయటపడగా, కీర్తి సురేష్ ఇచ్చిన ఈ క్లారిటీతో మెగా ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న వార్‌కి ఫుల్ స్టాప్ పడినట్లే. ఇక ‘రివాల్వర్ రీటా’తో కీర్తి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

