తెలుగు సినిమా మార్కెట్, డిస్ట్రిబ్యూషన్ అంటే ఒకప్పుడు దిల్ రాజు గారే కింగ్. కానీ గత కొంతకాలంగా ఆయన ప్లానింగ్ ట్రాక్ తప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ‘ఫ్యామిలీ స్టార్’, ‘గేమ్ ఛేంజర్’ లాంటి భారీ చిత్రాల రిజల్ట్స్ దిల్ రాజు కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీశాయి. సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఒక్కటే బ్లాక్ బస్టర్ కొట్టింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. ‘2026 మాదే’ అంటూ దిల్ రాజు చేసిన ప్రకటన ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ (IFFI) లో దిల్ రాజు, శిరీష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజుగారు.. 2017 తన బ్యానర్‌కి ‘గోల్డెన్ ఇయర్’ అని గుర్తు చేసుకున్నారు. ఆ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) నుంచి ఏకంగా ఆరు సూపర్ హిట్స్ వచ్చాయి. “అదే అద్భుతం 2026లో కూడా రిపీట్ అవుతుంది. మా ప్లానింగ్‌లో దాదాపు ఆరు పెద్ద సినిమాలు ఉన్నాయి,” అని దిల్ రాజు పూర్తి ధీమాతో చెప్పారు. ఇటీవల ఫ్లాప్‌లు దక్కినా, ఈసారి మాత్రం గ్యారెంటీ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారన్నమాట.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండుగ!
2026లో దిల్ రాజు బ్యానర్ నుంచి రాబోయే సినిమాల్లో అత్యంత ఆసక్తికరమైనది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. దిల్ రాజు గతంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘వకీల్ సాబ్’ లాంటి హిట్‌ను ఇచ్చారు. ఆ తర్వాత ‘OG’ సినిమాకు నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా భారీ లాభాలు చూశారు. ఇప్పుడు శిరీష్ స్వయంగా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సినిమా ప్లానింగ్‌లో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని కన్ఫర్మ్ చేశారు.
రాజకీయాల బిజీలో ఉన్న పవన్.. రాజుగారి కోసం డేట్స్ ఎప్పుడు ఇస్తారో, ఏ దర్శకుడితో చేస్తారో అన్నది ఆసక్తిగా మారింది. సోషల్ డ్రామా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
బాలీవుడ్లో అక్షయ్ తో భారీ డీల్.!
రాజుగారి ప్లానింగ్ కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. బాలీవుడ్లో కూడా భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కామెడీ స్పెషలిస్ట్ డైరెక్టర్ అనీస్ బాజ్మీ కాంబోలో సినిమా చేయనున్నట్లు దిల్ రాజు ధృవీకరించారు. ఇది తమ బ్లాక్ బస్టర్ హిట్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రీమేక్ అని, అయితే కేవలం ‘ఎక్స్-గర్ల్ ఫ్రెండ్, ఎక్స్-కాప్’ అనే మెయిన్ పాయింట్‌ను మాత్రమే తీసుకుని, బాలీవుడ్ ఆడియెన్స్ కోసం కథలో మార్పులు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రేజీ కాంబినేషన్ 2026లో షూటింగ్ మొదలుపెట్టనుంది.
ఇక యంగ్ హీరోల విషయానికొస్తే, రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ‘రౌడీ జనార్దన్’ అనే సినిమాను ప్లాన్ చేశారు. దీనికి రవికిరణ్ కోలా దర్శకుడు కాగా, హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తోంది. మరో సంచలన ప్రకటన ఏంటంటే.. ‘బలగం’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు వేణు యెల్దండి డైరెక్షన్లో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ‘యెల్లమ్మ’ అనే సినిమా రాబోతోంది.
మ్యూజిక్ సెన్సేషన్ DSP హీరోగా మారడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశం. ముందుగా నాని, నితిన్ లాంటి హీరోలను అనుకున్నా.. చివరకు DSP చేతికి వచ్చింది. వీటితో పాటు ఆశిష్‌తో ‘దేత్తడి’ అనే చిత్రం కూడా ప్లానింగ్‌లో ఉంది.
దిల్ రాజుగారి ఈ ‘సిక్స్ ప్యాక్’ ప్లానింగ్ చూస్తుంటే.. ఆయన చెప్పినట్లు 2026 నిజంగానే ఎస్.వి.సి.కి గోల్డెన్ ఇయర్ అవుతుందో లేదో చూడాలి. ఫ్లాప్‌లకు భయపడకుండా దిల్ రాజు మళ్లీ పెద్ద బెట్టింగ్ వేయడం నిజంగా సాహసమే!

