సింబుకు విలన్‌గా విజయ్ సేతుపతి? ‘అరసన్’ సంచలన అప్డేట్!

కోలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే చర్చ. అది… నేషనల్ అవార్డు విన్నర్ వెట్రిమారన్ , ‘స్టార్’ హీరో శింబు కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ‘అరసన్’ గురించి. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ ఇచ్చిన ఒక బిగ్ అప్డేట్… ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తోంది.

ఆ న్యూస్ ఏంటంటే… ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యారు. అవును! ఆయన ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కొందరి సమాచారం ప్రకారం, ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత కలైపులి ఎస్ థాను తమ ప్రొడక్షన్ బ్యానర్ V Creations ద్వారా అధికారికంగా ప్రకటించారు. (మానవత్వం కలుస్తోంది, గొప్పతనం కనిపిస్తోంది) అంటూ విజయ్ సేతుపతిని స్వాగతించారు. ఈ ప్రకటనతో ‘అరసన్’ సినిమా రేంజ్, బిజినెస్ ఒక్కసారిగా పెరిగిపోయాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి, వెట్రిమారన్ ముందుగా సూర్య తో ‘వాడివాసల్’ చేయాల్సి ఉంది. దాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి, సింబుతో ఈ ‘Vada Chennai Universe’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ‘అరసన్’ అనేది ధనుష్ ‘వడ చెన్నై’ (2018) సినిమాకు డైరెక్ట్ సీక్వెల్ కాదు. కానీ, ఇది అదే గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో, నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ‘చెప్పని కథ’ అని వెట్రిమారన్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇందులో సింబు రెండు విభిన్నమైన గెటప్స్, లుక్స్ లో కనిపిస్తారని ఇప్పటికే రిలీజైన మాస్ ప్రొమో వీడియోతో అర్థమైంది. అందులో సింబు క్యారెక్టర్… తన లైఫ్ స్టోరీని డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తో సినిమాగా తీయమని చెప్పడం, ఆ క్యారెక్టర్‌లో హీరో ధనుష్ ను పెట్టమని అడగడం లాంటి సన్నివేశాలు ‘వడ చెన్నై’ యూనివర్స్‌కి పక్కా కనెక్ట్ అయ్యాయి. దీంతో పాత పాత్రలైన ఆండ్రియా (చంద్ర), సముద్రఖని లాంటి వారు కూడా ఈ కథలో భాగమవుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఇక, టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు ‘రాక్‌స్టార్’ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. వెట్రిమారన్, అనిరుధ్ కాంబోలో ఇది మొదటి సినిమా. సింబు, వెట్రిమారన్, విజయ్ సేతుపతి..ముగ్గురు పవర్ఫుల్ ఆర్టిస్టులు/టెక్నీషియన్స్ కలవడం.. ఈ ప్రాజెక్ట్ కి ఒక రేంజ్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Leave a comment